Tuesday, May 3, 2022

మార్పు రావాలి

కవన కిరణాలు కి పంపినది
అంశం : శ్రమజీవనము సమానాధికారములు.
రచన: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్: మహారాష్ట్ర .

శీర్షిక  : మార్పు రావాలి.

శ్రమైక జీవన సౌందర్యానికి
సమానమైనదేదీ లేదన్నారు
విప్లవ కవి శ్రీ శ్రీ  ॥

కష్టపడనిదే పుాట గడవని వారు
శ్రామిక జీవితానికి అలవాటు పడిన 
వలస కార్మికులు .॥

బడగు జీవులకు బ్రతుకు లేదు .
సరి సమాన హక్కుల చట్టాలు రావు .
పొట్ట కుటికోసం కాలినడక
ప్రయాణాల తో కటిక పేదలు వేవేలు  ॥

కర్షకుడు లేనిదే కడుపుకింత
కుాడు ఉండదని తెలిసినా
ఆతని కష్టానికి తగిన ఫలితమిచ్చే
సదుపాయాలను సమకుార్చలేకపోతున్నాము ॥

ఆర్ధికంగా నిలదొక్కుకోలేని
అభాగ్యులవి అంటరాని తనపు 
అరాచకపు ఆచారాలకు  బానిసత్వాన్ని  
అలవర్చుకొన్న బాంచన్ బ్రతుకులు .॥

ఏ ఆధునిక సమాజానికైనా 
మార్పు చాలా అవసరం. 
కానీ ఏ న్యాయస్థానంలోనీ 
అడుగు బడుగుల బ్రతుకు చట్టాలు
సవరింపబడి అమలు కాలేదు ॥

రాజులు మారుతున్నా నాటి నుండి
నేటి వరకు ఎదుగు బొదుగు లేక
 రాజకీయ రణ నీతులకు అభాగ్యులు
అణచివేతలకు ఆహుతౌతుానే ఉన్నారు॥

మౌలిక సదుపాయాలనైనా 
సమకుార్చలేని చేతకానితనంతో
రాజకీయ వైఫల్యాలు 
తలవాల్చుతున్నాయి॥.

వారికి సమాన పౌరసత్వాన్ని 
ఆధార్  పత్రాలతో  పాటు
ఆర్ధిక సదుపాయాలు 
సమకుార్చిన నాడు "మే" డే
జరుపుతున్న మనం తలెత్తుకోగలం ॥

No comments:

Post a Comment