శీర్షిక : అమ్మే అంతా....
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
అమ్మ రక్త మంసాలతో నిండిన బొమ్మవు.
క్షీరామృత ధారలతో జీవం పొందిన ఘనవు
అమ్మ ఒడిలో అందలాలనేలిన ధన్యుడవు ॥
పిల్లల కోసం పరితపించేది అమ్మ.
పెంపకంలో ఆనందపడేది అమ్మ .
అమ్మ పిల్లలకో ఆట బొమ్మ .॥
రాత్రి పగలుల నిదుర లేమి కష్టం
పిల్లల బోసినవ్వులలో సేద తీరిన ఇష్టం.
పెరిగే పిల్లలకు అమ్మ ఒక నేస్తం ॥
పిల్లల ఆట పాటలు అమ్మకు అనందం
స్కుాలుకు పంపేక బాధించే ఒంటరి తనం .
వారి నడతకు అమ్మే ఒక ఆదర్శం॥
పెద్దయ్యే పిల్లలు తల్లికొక సవాలు.
వారి బ్రతుకు చింత అమ్మ మధనకు కారణాలు.
వారి వైవాహిక జీవిత స్పర్ధలు అమ్మకు శాపాలు॥
కరిగి పోయిన కొవ్విత్తిలా అమ్మ
అరిగిపోయిన ఎముకలు నిండిన బొమ్మ
అమ్మ ఋణం తీర్చుకోవాలి సుమ్మ .॥
హామీ :
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితముకాని నా స్వీయ రచన ॥
No comments:
Post a Comment