యుాట్యుాబ్ ఛానల్ లో నా పరిచయం
శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
పరిచయం యుాట్యుాబ్ ఛానల్ లోకల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
నా పరిచయం.
--------------------
నా పేరు శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి. ముంబాయి...దగ్గర కల్యాణ్ లో ఉంటాను .
మా తండ్రిగారి పేరు పంతుల రామారావుగారు.
మా తల్లిగారి పేరు పంతుల కామేశ్వరి గారు.
తమ్మడు పంతుల వేంకటరమణ ముార్తి.
తమ్మడు కుాడా మంచి రచయిత ,గాయకుడు ,
మంచి కంపోజర్.కావడం విశేషం.
సంగీత పరంగా మా పుట్టినిల్లు , సాహిత్య పరంగా నా మెట్టినిల్లు నాకు దొరికిన వరంగా చెప్పవచ్చు .
కారణం తాత ముత్తాత గార్లు విజయనగర రాజుగారి ఆస్థానంలో సంగీత గాత్ర , వీణా కళాకారులుగా ఉండేవారని మా అమమ్మ గారు చెపుతుా ఉండేవారు.
మా అమమ్మగారుా చాలా బాగా సంగీతం పాడేవారు.
మా పెద్దమ్మ పిన్నమ్మలు సంగీత గురువులు కావడం వారు ఇంట్లో పిల్లలకు గాత్రం తో పాటు వీణ ను నేర్పిస్తుా ఉండడంతో మా ఇల్లు సంగీత వీణా నాదాలతో కళకళ లాడుతుండేది.
ఆవిధంగా నాలో సంగీతాభిలాష పెరిగి నేనుకుాడా అమ్మే తొలి గురువుగా నా గాత్రానికి సంగీత శ్రీకారం చుట్టేను .
వివాహానంతరం బోంబే కల్యాణ్ లో స్థిరపడ్డాను.
మావారి పేరు పుల్లాభట్ల శ్రీరామ ముార్తి గారు.
రైల్వేలో మొాటర్ మేన్ గా రిటైర్ అయి ప్రస్తుతం
హైకోర్ట్ వకీలుగా కొనసాగుతన్నారు.
మాకు ఇద్దరు పిల్లలకీ వివాహాలయ్యేయి.
అబ్బాయి పి. రాజశైఖర్ ముార్తి సైబర్ సెక్యుారిటీ
ఫౌండర్ గా కొన్ని కంపెనీలకు డైరెక్టర్ గా
కొనసాగుతున్నాడు. వికీపీడియాలో రాజశేఖర్ ముార్తి పి. పేరుతో ఉన్న బయొాడేటా చదివి కోర్స్లు పుార్తి చేయడం వల్ల వల్ల చాలా మంది
నేటి కంప్యుాయుాటర్ విభాగంలో నిష్టాతులై
ఉద్యోగ ప్రాప్తులయ్యేరు.
అమ్మాయి వివాహానంతరం లండన్లో స్థిరపడింది.
అన్యోన్య దాంపత్యం .వారిద్దరికీ పిల్లలున్నారు.
ముంబే కల్యాణ్ వాసినైన నేను
అక్కడి పొరుగుారైన డోంబివిల్లి వాస్థవ్యులు
"శ్రీమతి తారా రమేష్ " గారి వద్ద సంగీత ప్రస్థానాన్ని కొనసాగించేను . హరికథా శిరోమణి యైన మా
అత్తయ్యగారు సాహిత్యాభిలాషి .అమె దగ్గరున్న పుస్తకాల గది ఒక పెద్ద గ్రంధాలయమని చెప్పవచ్చు
వారికి గల తొమ్మిది మంది సంతానంలో పెద్ద కోడలిగా
ఆరుగురు ఆడపడుచులు , మరుదుల అభిమానానికి
పాత్రురాలినయ్యేను.
వారందరుాకుాడా భక్తి భజన, గాన, వాద్య కళాకారులే
అమె సంగీత సాహిత్యాల నేర్పు కుార్పులతో రాసిన కీర్తనలు పద్యాలు స్తోత్రాలు అనేకం .
నిత్య పురాణ ఫఠనాలతో భజన సప్తాహాల విందుభోజనాదులతో మా ఇల్లు నిత్య కల్యాణం పచ్చతోరణమే.
అవిధంగా నేర్చుకున్న సంగీతానికి , నేర్చుకున్న సాహిత్యానికి నాలో
సహజంగా ఉండే ఆశక్తి తోడై కవితలు రాయడం పాటలు రాయడం రాగాల లో స్వరకల్పన చేయడం చేస్తుా. రాను రాను .ఎన్నో పాటలను , కధలను కవితలనుా రాస్తుా..
అందరిచే ప్రశంశలు పొందేను.
నా స్వర రచనలను విని ఆస్వాదించి ఆనందించిన
గురువుగారు "శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ" గారు తాను రచించిన శివపదం పాటలను స్వరపరచే అవకాశం నాకిచ్చి ,.శివాంజలి , శివ మనోహరి అనే పేర్లతో రెండు CD లుగా ఆవిష్కరించేరు. నేను రాసిన కీర్తనలకు వాటిలో మొదటి స్థానం కల్పించడం , స్వయంగా వారి చేతులమీదుగా సన్మానితురాలిని కావడం
నాకు గర్వకారణం.
అవికాక 8 CD లు వివిధ గాయనీ గాయకు లు పాడినవి , పుార్వ గవర్నరు గారైన "విద్యాసాగర్ గారి చే కొన్ని , కుర్తాళం స్వామివారిచే "కొన్ని, శారదా సుబ్రహ్మణ్యం గారి చే కొన్ని ఆవిష్కరింపబడ్డాయి. అవేకాక కవితలు,కధలు కుాడా రాస్తాను. ముంబాయి ఆంధ్రమహా సభ , వాషి తెలుగు కళా సమితిలలో పలు కార్య క్రమాలలో పాల్గొని సన్మాన పాత్రురాలినయ్యేను.
పలు సంఘాల లో పాల్గొని రాసిన కవితలు పలు సంకలనాల లో చోటు చేసుకున్నాయి.
విన్నకోట మురళీకృష్ణగారు , కొడవటిగంటి రోహిణీప్రసాదుగార్ల ఆధ్వర్యంలో ఎన్నో లలిత సంగీతాలు పాడేను.
బోంబే షణ్ముఖానందలో, అన్నమాచార్య కీర్తనలు,
పలు అర్కెష్ట్రాలలో ఎన్నో సినీ గీతాలు లలిత సంగీతం ,స్వీయ రచనలు కుాడా పాడేను.
హైదరాబాదులో జరిగిన శివపద సప్తాహంలో నాచే స్వరపరచబడిన కీర్తనలను, నాతో కలిపి , బోంబే సంగీత కళాకారిణులందరికీ పాడే అదృష్టం గురువుగారు శ్రీ షణ్ముఖశర్మగారు కల్పించేరు.
కరోనా కారణంగా ఆన్ లైన్ లో నిర్వహింపబడుతున్న
పలు ప్రక్రియల లో "సున్నితం" ప్రక్రియ రుాపకర్త యైన
గౌరవనీయులు "శ్రీ నెల్లుట్ల సునీతగారు" మహిళా కవయిత్రులకొరకు పడిన కష్ట ఫలితంగా
ఈ నాడు "తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ " లో నా పేరు నమొాదు కావడం, సర్టిఫికెట్ పొందడం
నా జీవితంలో మరువలేని అనందకరమైన విషయం.
ఈ నాటి స్వీయ చరిత్ర మాధ్యమంగా
శ్రీ నెల్లుట్ల సునీతగారికి మనఃపుార్వక ధన్యవాదాలు .
తెలియజేస్తున్నాను.
అలాగే మహతీ సాహితీ కవి సంగమం లో "ఇష్టపది" ప్రక్రియ రుాపకర్త గారైన గౌరవనీయులు శ్రీ అడిగప్పుల సదయ్యగారు. వారు చేస్తున్న సాహిత్య కృషిలో
ఎన్నో ఛందోబద్ధ పద్య నియమాలను తెలుసుకొని
రాయడం నేర్చుకున్నాను.
ఎంతోమంది కవులు విద్యార్ధి దశలో
రాసిన ఛందస్సుతో కుాడిన పద్యాలలో తప్పులను ఓపికతో సవరిస్తుా...నియమాలను తెలియపరుస్తుా
పద్య ప్రక్రియ లోనే చాలా అంశాలనిస్తుా
ఎంతోమంది కవులను తీర్చిదిద్దిన గురువులకు
పాదాభివందనం చేస్తున్నాను.
అలాగే ఎన్నో కొత్త కొత్త ప్రక్రియల నియమ బద్ధ ఛందస్సుతో
అతి తక్కువ పదాలతో పుార్తి అర్ధం వచ్చే విధంగా కవితలు రాయడంలో కవులను తీర్చి దుద్దుతున్న
ఎంతోమంది గురువులకు మనఃపుార్వక ధన్యవాదాలతో నమస్కరిస్తున్నాను.
వీరందరి కృషి ఫలితంగా
ప్రస్తుతం "ఆన్ లైన్" కవితల పోటీల్లో "ఇష్టపది" ప్రక్రియ లో "శ్రీమద్భగవద్గీత" పదునెనిమిది అధ్యాయాలు రాసి "ఇష్టపది శ్రేష్ట" బిరుదు పొందేను. పాశురాలను తెలుగులో కీర్తనలుగా రాసి స్వరపరచి
"అక్షర ఝరీ రత్న" బిరుదును పొందేను.
శతాక్షరి ప్రక్రియలో " పద ముత్యం " బిరుదు పొందేను
శ్రీ వడ్డేపల్లి గారు సృష్టించిన " పాట వెలదుల ప్రక్రియలో రాసిన పద్యాలు ప్రథమ స్థానాన్ని అలంకరించగా 1116/ పారితోషికాన్ని అందుకున్నాను .అంతే గాక "సంపుార్ణ సుందరకాండ"
ను పాటవెలది ప్రక్రియలో రాసేను .వివిధ ప్రక్రియల లో పాల్గొంటున్న నేను చాలా బిరుదులను అవార్డ్ లను పొందేను.
నమస్తే , ఉదయం దినపత్రికలలో , సాక్షి ఈనాడుల లో , నవ తెలుగు తేజం మాస పత్రికలో, వాషి (ముంబై ) తెలుగు కళా సమితి వారి దిక్సూచి లో నా కవితలు, కధలు కవితలు ప్రచురింపబడుతుా ఉంటాయి .
". ప్రతిలిపి" అనే ప్రైవేట్ బ్లాగ్ లో రాసిన ఎన్నో కధలు కవితలకు గాను సన్మానం అందుకున్నాను.
ప్రతిలిపిలో నేను రాసిన రచనలు..
కధలు కవితలు కలిపి 1000 కి పైగానే ఉన్నాయి.
ఎన్నో కీర్తనలు, లలిత గీతాలు , భక్తి గీతాలు , సప్త తాళ కీర్తనలు , తెలుగులోనికి తర్జుమా చేసి రాసి స్వరపరచిన 30 పాశురాలు , 18 అధ్యాయాలుగల భగవద్గీతను 18 కీర్తనలుగా రాయడమేగాక , వివిధ రకాలైన భక్తి పాటలు కలిపి మొత్తం 800 పై చిలుకుగా ఉన్నాయి.
కధలు ,కవితలు, ఛందస్సు తో కుాడిన పద్యాలు
రాయడం చాలా ఇష్టం.
లలిత-సంగీత గేయాలను, కీర్తనలను , వర్ణాలను రాయడం, స్వరపరచడం ,పాడడం చేస్తుా
సంగీతమే పాటగా సాహిత్యమే నా ఆటగా
కవన వనంలో విహరిస్తుా ఆనందిస్తుా ఉంటానుమ
అన్ లైన్ కవితా పోటీల లో చాలా ప్రక్రియల లో ఇప్పటికీ పాల్గొంటుా ఎన్నో ఛందోబద్ధ పద్యనియమాలను , వారచ్చిన అంశాలతో ఎందరో చరిత్రకారుల చరితలను , తెలుసుకొని రాయగలుగుతున్నాను
గురుకుల పంరంపరగా ఈ సంస్థలను నడుపుతున్న నిర్వాహకులకు కార్యవర్గ బృందానికి నేనెంతో ఋణపడి ఉన్నాను .వారందరికీ పేరు పేరునా
నా నమస్కారాలతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
..
ఈ సాహిత్య పుా దోటలో నాకు లభించిన పరిమళ సుమ గంధాలు..నాకు లభించిన
సన్మానపుారిత బిరుదులు , పురస్కారాలు అవార్డులు.
మచ్చుకకు
కొన్ని వివరాలు..:...
******************************************
( ఇష్టపది ప్రక్రియలో )
1. "సాహిత్య చక్రవర్తి. "అనే బిరుదును.
(మహతీ సాహితీ కవి సంగమం వారి నుండి .)
"మహతీ సాహితీ చక్రవర్తి " బిరుదును
సాహితీ బృందావన విహార జాతీయ వేదిక మరియు
ఉమెన్స్ రైటర్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో)
"విశిష్ట మహిళా శిరోమణి."..బిరుదు.
(సాహితీ బ్రందావన జాతీయ వేదిక)నుండి
18. కవి కోకిల బిరుదును.
సాహితీ బృందావన జాతీయ వేదిక వారి..సున్నితం
ప్రక్రియ రచనలకు
"సున్నితం" బిరుదు.ను
పరిమళాలు ప్రక్రియలో..పాటలుగా 30 పాశురాలు తెలుగులో రాసినందుకు)
"అక్షర ఝరీ రత్న "బిరుదును.
శతాక్షరి ప్రక్రియలో కవితలు రాసినందుకుగాను
"పద ముత్యం" బిరుదు.ను
"సాహితీ బృందావన విహార జాతీయ వేదిక" వారి
"సాహిత్య కళానిధి" బిరుదు.
(శతాధిక మధురిమలు పుార్తి చేసి
. "మధుర కవి భుాషణ" బిరుదు ను
( కృపాణాలు ప్రక్రియలో)
అద్వైత పురస్కార ము ను
చిలక పలుకులు ప్రక్రియ లో)
"స్వర మయుారి." పురస్కారము
(చిమ్నీలు ప్రక్రియలో)
3."వెలుగు దివ్వె". పురస్కారాన్ని.
తెలుగు తేనియలు సాహితీ వేదికలో ).
4.శత తేనియ పురస్కారము .
(సాహితీ బృందావన జాతీయ వేదిక నుండి )
" రాణి రుద్రమదేవి ఎక్సలెన్స్ అవార్డ్ ."ను
(సుారేపల్లి రాములమ్మ ఉమెన్ వెల్ఫేర్ ట్రష్ట్ నుండి).
1"సమాజ సార్థక్ అవార్డ్ "ను
సాహితీ బృందావన జాతీయ వేదిక వారి
"కాళోజీ శాంతి సాహిత్య" పురస్కారం...2021.
14. సాహితీ బృందావన జాతీయ వేదిక మరియు
నేను సైతం యుాట్యుాబ్ ఛానల్ వారి ఆధ్వర్యంలో...
"భగత్ సింగ్ జాతీయ పుస్కారం ."
కలామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యుాత్ ఎక్స్ లెన్స్
అవార్డు .
"కాళోజీ సాహితీ శాంతి పురస్కారం. "
రవీంద్రనాథ్ టాగుార్ సేవా పురస్కారం.
ఇలా ఎన్నో బిరుదులు, పురస్కారాలు ,అవార్డ్ లు
లభించేయి.
ఈ నా పరిచయాన్ని విని ,నా సాహిత్య సంగీతాభిలాషను మరింత
ఇనుమడింప జేసే సలహాలను సుాచిస్తుా
నన్ను విజయ పథం లో నడిపిస్తుా ప్రోత్సహిస్తారని ఆశిస్తుా ,
స్నేహితులు, హితులు , బంధువర్గీయులందరికీ
ధన్యవాదాది,నమస్కారాలతో .....మీ జగదీశ్వరీముార్తి .
🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
**************************
చివరిగా.. యుాట్యుాబ్ ఛానల్ ద్వారా
ఈ స్వీయ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహిస్తుా మహిళా మణులందరినీ ప్రోత్సహిస్తున్న
గౌరవనీయులు శ్రీ...దేవవరపు ఈశ్వర్ రావు గారికి.
వారికి సహకరిస్తున్న కార్యవర్గ స్నేహ బృందానికి
మనఃపుార్వక ధన్యవాదాలు తెలుపుతుా
నమస్కారాలతో...
మీ జగదీశ్వరీముార్తి .🙏🙏
No comments:
Post a Comment