Tuesday, May 24, 2022

సురవరం మన వరం

24/05/2022.

గోరసం మరియూ అక్షరకౌముది వారు నిర్వహిస్తున్న సురవరం కవితా పండుగ కొరకు 

అంశం: సురవరం - తెలుగుజాతి వరం.
శీర్షిక  : బహుముఖ ప్రజ్ఞాశాలి .

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .


నిజాం నిరంకుశ పాలనలో
మతం మాధ్యమంగా చేసుకొని
తెలుగు భాషా సంస్కృతులకు
 జరిగిన అవమానం .॥
 
వ్యవహారిక భాషగా ఉర్దూ భాషకు పట్టం.
తెలుగు జాతి సంస్కృతిని సాంతం, 
 కాలరాయడానికి చేసిన ప్రయత్నం.॥

తెలుగు గ్రంథాలయాల ఏర్పాటును 
నిషేధించిన నైజాం తెలుగు సభలు, 
సమావేశాలకు  తమ అనుమతి 
కోరలన్న అహంకారపుారిత శాశనాలు॥

తెలుగువారి అణచివేతల కారణంగా
కలం ఎక్కుపెట్టిన సురవరం, నిజాం
 నిరంకుశ పాలనను విమర్శిస్తూ 
నిర్భయంగా రాసిన ఎన్నో వ్యాసాలు
 ప్రజలలో  తెచ్చిన చైతన్యం ॥

ప్రజా శ్రేయస్సే జీవిత పరమార్ధగా  
ప్రతిష్టాత్మక సంస్థల ఉన్నతి, సురవరం-
 ప్రతాపరెడ్డి  సాధించిన ఘన విజయం.॥

గోల్కొండ కవుల ప్రత్యేక సంచికలో
354 మంది తెలంగాణ కవుల కవితలను
 చేర్చి తెలుగువారి ఘనతను చాటిచెప్పిన
ధీశాలి సురవరం ప్రతాపరెడ్డి గారు.॥

త్యాగం, దేశభక్తి, భాషాభిమానాలతో
ఆయన రచించిన ‘ఆంధ్రులు సాంఘిక చరిత్ర’కు
తొలి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 
లభించడం తెలంగాణ గడ్డ చేసుకున్న అదృష్టం”   

సురవరం ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా
తెలంగాణ యాసలోని మాధుర్యాన్ని
తెలుగు భాష ప్రత్యేకతను కాపాడడమే
ఆయనకు మనమందించే ఘనమైన నివాళి.॥

హామీపత్రం: 
ఈ సురవరం కవిత కేవలం ఈ సమూహము కొరకు మాత్రమే వ్రాసినది అని, ఎక్కడ పోస్ట్ చేయలేదని హామీ ఇస్తున్నాను.



No comments:

Post a Comment