02/05/2022
సాహితీ బృందావన జాతీయ వేదిక
Women writers కు పంపినది.
అంశం : కార్మిక దినోత్సవం .
శీర్షిక : శ్రమైక జీవనం .
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
కష్ట పడనిదే కడుపు నిండని దౌర్భాగ్యం.
కాయ కష్టమే జీవితమైన బడుగు జీవితం.
మనిషికో తలరాత రాసిన విధి విలాసం.
బలహీన వర్గాల బ్రతుకు తెరువు మార్గం ॥
కొందరు తిని పారేసిన పోగు చెత్త పని
మరి కొందరి ఆకలి తీర్చే ఖని.
బాధ్యత లేని బలసిన వాడల్లో
పులిసిన ధనానికి నిదుర లేమి పని. ॥
కలుషిత వ్యర్ధాల కర్ఖానాలలో కాలి-
కమిలిన కష్ట జీవుల చమట ఫలం
అందమైన సామగ్రిగా అంతరాల
అంతస్తుల్లో మెరుస్తున్న వైనం.॥
పొట్ట నిండని వేతనాలతో
వాడలుతున్న వేల కార్మికుల
ఆకలి తీరని దైన్య జీవితం ॥
ఎదుగు బొదుగు లేని కార్మిక
జీవితాల కన్నీటి కథనం ॥
పార పలుగుల పరుగు కష్టానికి
కుాడు గుాడు కరువైన ఆక్రోశం .
అన్నదాతలై అలసిన ఖర్మానికి
వెన్నెముక విరిగిన రైతన్న శోకం ॥
రాజ్యాలు మారుతున్నాయి.
రాజ్యాంగాలు మారుతున్నాయి.
బడుగు బ్రతుకుకు, రైతన్న దిగులుకు
కష్ట జీవుల ఉన్నతికి తగిన ప్రణాళికలు
చట్ట బద్ధంగా అమలుకాలేదు ॥
శ్రమ జీవుల అస్థిత్వం లేని రోజు
జన జీవితం రోగాలు నిండిన తరాజు॥
కార్మికుల కష్టాన్ని గుర్తించిన రోజు
నిజమైన మానవత్వం కార్మిక
దినోత్సవానికి మకుటం పెట్టిన రోజు.॥
హామీ :
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితము కాని నా స్వీయ రచన.
No comments:
Post a Comment