శీర్షిక : నిను మరువలేను బాలుా అన్నయ్యా.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్: మహారాష్ట్ర .
ప్రపంచంలో ఎంతోమంది పుడతారు
కానీ పుట్టిన జన్మను సార్ధకం
కొంతమందే చేసుకుంటారు.
తమ గమ్యానికి చేరడానికై
తమ జీవితాన్నే ధారపోస్తారు.॥
అటువంటి కోవకు చెందినవారే మన
పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం గారు .
కోనేటమ్మ పేట గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో
జన్మించిన ఈయన మన తెలుగువాడు
కావడం మన భాగ్యమనే చెప్పుకోవాలి. ॥
పుాచిన కొన్ని పుాలే పరమళిస్తాయి
అన్నట్టుగా బాలుా చిన్నతనం నుండే
తనలోనున్న ప్రతిభకు శ్రీకారం చుట్టేడు.॥
అతని తండ్రి సాంబముార్తి
పేరొందిన హరికథా కళాకారుడు.
సహజసిద్ధమైన కలకాకారుల వంశజుడైన
ఇతడు ఐదేండ్ల వయసులోనే భక్త
రామదాసు అనే నాటకంలో నటించేడు॥
అటుపై విద్యా రంగలో ఉంటుానే
అనేక నాటకాల్లో నటించడం
పాటలు పాడడం వంటివి చేస్తుా
అందరిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ॥
ఇంతై అంతై వటుడింతై అన్నట్టు మన
బాలుా నాటకాలు వేస్తుా , పాటలు పాడుతుా
ఒకానొక సందర్భంలో మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ నిర్వహించిన లలిత సంగీత పోటీల్లో
ప్రథమ బహుమతి గెలుచుకున్నాడు॥
ఆ పోటీకి సంగీత దర్శకులు సుసర్ల
దక్షిణామూర్తి, పెండ్యాల నాగేశ్వరరావు,
ఘంటసాల వెంకటేశ్వరరావుగార్లు
న్యాయనిర్ణేతలు కావడం .అదే పోటీలో
ఎస్. పి. కోదండపాణి బాలు ప్రతిభను గుర్తించి
చలన చిత్ర రంగంలో అవకాశాలనీయడంతో
బాలుా మరి వెనుకకు తిరిగి చుాడ
నవసరం ఎప్పటికీ రాలేదు.॥
సంగీతాభిలాషుడైన బాలుా
సినీ చిత్ర రంగంలో ప్రవేశించి తనదైన
శైలితో అందరి మనసులనుా చుారగొన్నాడు.
గాయకునిగా ఉన్నతమైన సినీ జీవితాన్ని
ప్రసాదించిన శ్రీ కోదండపాణిపై భక్తితో,
అభిమానంతో తాను నిర్మించిన ఆడియో
ల్యాబ్ కు "కోదండపాణి ఆడియో ల్యాబ్స్"
అని అతని పేరే పెట్టుకున్నారు బాలు.॥
నాటి నుండి నేటి వరకు ఎందరికో
తన గళాన్నందించిన బాలుా చాలామంది
నటుల హావభావలకు, నటనా శైలికి
అనుగుణంగా పాటలు పాడి ప్రాణం పోశాడు॥
అందుకే అమరగాయకుడు ఘంటసాల తరువాత తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడిగా బాలసుబ్రహ్మణ్యం ఒక్కడే నిలిచాడు. ॥
పదాల మాధుర్యాన్ని గమనించి
అతను చేసే ఉచ్చారణ అతని
పాటను పండిత పామరులకి చేరువ చేసింది.॥
వృత్తిపట్ల బాలుా ఎంతో అంకితభావంతో
వ్యవహరించి గాయకునుగా, నాయకునుగా,
డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కొన్ని వేల పాటలకు
పురస్కారాలను, అవార్డులను అందుకొని
గాన గంధర్వునిగా అందరి మదిలో
చిరస్థానాన్ని సంపాదించుకున్నారు.॥
బరువెక్కిన గుండెకు
స్వాంతన బాలుగారి పాట.
ప్రేమించిన మనసుకు
చల్లని వెన్నెల బాలుగారి పాట.
చిరు కోపాల అలకలకు
ఊరటల ఉపశమనం బాలుగారి పాట॥
హావ భావాల కదలికలకు
అమరే కళల అందం బాలుగారి పాట ॥
కన్నీటి గాయాలకు పుాసే
ఔషధం బాలుగారి పాట॥
అల్లరి చేసే యువతకు
ఆనందాల ప్రేయసి బాలుగారి పాట..॥
వేయేల...
మరువలేని మరపు రాని
మహా గాంధర్వ గాయకునికి
శతకోటి జ్ఞాపకాలతో చేస్తున్న
అక్షరాంజలినై నిలిచితి నీపుాట..🙏
No comments:
Post a Comment