అంశం : దృష్టి .
శీర్షిక : సమాన దృష్టి .
రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
ప్రక్రియ : ఆటవెలది.
జాతి మతము లనెడు జాడ్యమ్ములనెంచు
లోక మందు దృష్టి లోప మదియె
తారతమ్యములవి తగినంతె జుాపుమా
ధర్మ బద్దులముగ ధరణి మనగ ॥
దృష్టి లోపమున్న ధృక్పథమ్మదె మారు-.
వావి వరుస మరచు వక్ర బుద్ధి.
ధర్మ కర్మ విడచి దారుణమ్ములజేయు---
మనిషి విలువ తరుగు మహిని మనుజ ॥
కంటి చుాపు లేని కబోదు లనుగాంచి
అయ్యొ పాప మందు రవని జనులు
కన్ను లున్న వారు కపటనీ తులతోడ
మసలెదరుగ మహిని మాయ గాదె ॥
దుార దృష్టి తోడ దుర్ధశధిగమించ
బ్రతుకు భార మవదు భవిత లోన
జాగురుాకతెరిగి జగమందు మసలుటే
జ్ఞాన దృష్టి యంచు జ్ఞాతు లనియె ॥
తగిన దృష్టి నీదు తలరాత నేమార్చు
కీర్తి బాట నేలు కిటుకు దెల్పు
సాధు సజ్జనునిగ సామ్యవాదముతోడ
మనుజు డేలు జగతి మాన్యు డగుచు ॥
No comments:
Post a Comment