ప్రపంచ శాంతి దినోత్సవం సెప్టెంబర్ 21 సందర్భంగా
కవిత శీర్షిక : శాంతిమంత్రం , సర్వులకుా సమ్మతం.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్: మహారాష్ట్ర .
మారుతున్న మనస్తత్వాల మారణహోమాలు
స్వాతంత్ర్యానంతరం కుాడా సమసిపోని సమస్యలు
కాల్పులు, కొట్లాటల , హింస నిండిన బాటలు
అశాంతి నిండిన భరతావనిలో కన్నీటి గాధలు ॥
రాజకీయ వైఫల్యాల దుష్పరిమాణాలు
హింసాపుారిత సంఘటనలకు ఆనవాళ్ళు
స్వార్ధపుారిత పాలనలో నలిగిపోతున్న జనాలు
ఫలితంగా కోరుకుంటున్న శాంతి సమావేశాలు॥
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంతో
2008 సెప్టెంబర్ 21, చరిత్రలో
నమోదైన. ప్రపంచశాంతి దినోత్సవం .
సర్వత్రా శాంతివ్యాప్తికై ఈదినం అంకితం ॥
మహాత్మాగాంధీ అహింసా, శాంతిపురస్కారం
సమస్యల శాంతియుత పరిష్కారకులకు ప్రదానం
ఉగ్రవాదాన్ని రుాపుమాపేందుకు ప్రయత్నం
శాంతిమంత్రం అన్ని సమస్యలనుా రుాపు మాపేతంత్రం॥
ఆవేశంతో అడుగు, అనర్ధ దాయకం
ఆలోచన లేనిమాట, అపార్ధాలకు కారణం
శాంతినిండిన మనస్తత్వం , సర్వులకు సమ్మతం.
సఖ్యతతో మెలుగుతుా ఎగరేద్ధాం శాంతికపోత కేతనం ॥॥
No comments:
Post a Comment