19/09/2022
మహతీ సాహితీ కవి సంగమం .
అంశ : చిత్ర కవిత .
శీర్షిక : పచ్చదనపు శొిభ
రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
ప్రక్రియ : ఆటవెలది.
ముాడు వంతు జలము ముాలమై జీవికి
ప్రకృతి తరుల నింపె ప్రజల కొరకు
జగతి నిండె జనము జలజంతు జాలము.
అందమైన సృష్టి అద్భు తమ్ము ॥
మనిషి బుద్ధి తరుగ మహిని కలుషితమ్ము
మంది పెరిగి పోయె మైల పెరిగె
కలిగె రోగ బాధ కాలుష్య కణబాధ
పెరిగ జనులు ఇలను తరిగె జలము ॥
పచ్చ దనము తరిగె పాడిపంటలు లేక
ఫలము కరువు బాధ ప్రజల బట్టె
పరము లాయె సొమ్ము ఫలములేని నిజము
బీడు భుామి మిగిలె బిక్కు మనుచు ॥
నిజము తెలియు మన్న, నిర్లక్ష్య వైఖరిని
నీల్గు చున్న జనము నిజము మనరు.
ప్రేమ నిండు ప్రకృతి పంచు నీడ నీయ
పసరు చున్న దదిగొ పట్టి చుాడు ॥
సగము కలుషి తముతొ సరిభుామి సగమాయె
మనగ నీడ లేక మనిషి మిగిలె
పరిసరమ్ములెల్ల పరిశుభ్ర ముగజేయ
ఫలము పసిడి బ్రతుకు బలము నీదె॥
No comments:
Post a Comment