బాల సాహిత్యం.....
అంశం : " ద" గుణింత పదాలతో...
.
శీర్షిక : దాయ్ దాయ్ చందమామ.
( బాలల గేయం..)
రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
దాయ్ దాయ్ చందమామ జాబిల్లి దావే
"దా" అంటుా మా పాప పిలచె పలుక రావే
దినమంత నీ కొరకు మారాము జేసి
దిక్కులన్ని చుాచి చుాచి అలసి నిద్దరోయె.॥
దాటి ఝాము రాతిరొస్తే నిద్దరొస్త దంటా
దినమంతా నువ్వొస్తే ఆటలాడు నంటా
దీనముగ వేడుకున్న దిగి రాకుంటే
దుమికి పై కెగిరి నిన్ను బంధిస్తా దంట ॥
దోబుాచు లాడబోతె దాగి దొరకవంట
దొంగాట లాడబోతె పరుగు పెడతవంట.
దారి మబ్బు బుాచి తాత నిన్నెత్తుకెళ్ళ.
దినమంత మాపాప వెక్కి వెక్కి యేడ్చె ॥
దుష్ట రాహు కేతు లంట నిన్ను బట్టి మింగ
ధైర్యముగా పోరాడి వారి జంపెనంట .
దట్టమైన మేఘాలు కమ్మి నిన్ను జుట్ట
దండముతో మా పాప దండించె నంట.॥
దేవతలకు వెలుగు పంచు దొడ్డ దివ్వె వంట
దేశ దేశాలు తిరిగి కథలు చెపుత వంట
దెయ్యాలే రాకుండా కాపు కాస్తావంట.
దట్టమైన చీకటున్న భయముండదంట ॥
మెరుపు తాత ఉరుముతుా భయపెడతాడంటా
ధైర్యముగా నువ్వు బాణ మేసి కొడత వంట
దెబ్బలకు మెరుపు తాత యేడుస్తాడంట
దుబుకు దుబుకు కన్నీరే కురియు వర్షమంట ॥
దాపు చెరువు నీటిలో నీ నీడను జుాచి
దుాకి, నీట పాప నిన్ను కాపాడునంట
దోస్తు వంట మా పాపకు దొరకి నావంట.
దరికు వచ్చి జోల పాడ నిద్దరోతదంట ॥
దండిస్తే మా పాపను, దరువులు మాకంట
"దా" రమ్మని పిలువ గానె పలుకుతావంట
దుప్పటిలో దుారగానె కళ్ళు ముాస్తా వంట.
దివ్వె లార్ప లాలి పాడి జో కొడతావంట ॥
దుారాన ఉన్న మంచి మామయ్యవంట
దుారి మబ్బు నీడల్లో దాగున్నావంటా ॥
దాయ్ దాయ్ చందమామ జాబిల్లి రావే
దగ్గరగా వచ్చి నీవు జోల పాడి పోవే ॥
దగ్గరగా వచ్చి నీవు..జోలపాడి పోవే....
***********************************
మహతీ సాహితీ కవి సంగమం
( బాల సాహిత్యం.).
అంశం : " ద" గుణింత పదాలతో...కవిత.
శీర్షిక : నేర్చుకోండి బాలలుా.
రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
ధనం మీద వ్యామొాహం ఉండకుాడదు .
ధార్మికమైన పనులను ఇష్టంగా చేయాలి.
దినమంతా కష్టించి పని చేయాలి.
దీనులను దయాగుణముతో చుాడాలి .॥
దుష్టులకు దుారంగా ఉండాలి .
ధుామపానము ఆరోగ్యానికి హానికరము.
దెబ్బలాటలు ఆడకుాడదు.
దేశభక్తి కలిగి యుండాలి ॥
దేముని నమ్మినవారికి దుఃఖము దుారమౌను.
దొర లెవరో దొంగలెవరో తెలుసుకొని మసలాలి.
దోపిడీ చేసినవారు శిక్షార్హులు.
దౌర్జన్యం చేసి ఎవరినీ బాధించకుాడదు .॥
దండుతనముతో దేనినీ పొందకుాడదు.
దయాగుణము కలిగియుండాలి .
ధారుణిలో కాలుష్యమును రుాపుమాపాలి.
దానగుణము సర్వోత్తమమైనది.॥
దుర్మార్గులుంటారు జాగర్త .
దుారం పాటించి మెలగడం మర్చిపోకు.
దుష్ట కణాలను పరిశుభ్రతతో పారద్రోలు.
దిక్సూచి వై ధరణిని సిరులు తరులు పెంచు॥
***********************************
No comments:
Post a Comment