సమదర్శిని పత్రిక వారి ఆధ్వర్యంలో
మడిపల్లి స్మారక ఈ సంకలనం కొరకు..
అంశం: మడిపల్లి భద్రయ్య సాహిత్యం - జీవితం
శీర్షిక : ఇరుసు వంటిది జీవితం .
ప్రక్రియ : ఆటవెలది పద్యాలు.
రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
1.
జీవితమ్ము నీది జీడిమా మిడిపండు
జీడి వలెను నంటు జిక్కులన్నీ
పట్టు జీడి పిక్కె పండు తీపిని పెంచు
జీడి వంటి జిలుగె జీవితమ్ము ॥
2.
నాల్గు దశల లోన నలిగిపోవును జీవి
కష్ట- నష్టములవి కావిడంచు
దుఃఖ బాట వెంట సుఖముండు గనవేమి ?
మనసు బెట్టి పోరు మరలి వచ్చు ॥
3.
బాల్య తనము నందు బడికిపో వువరకు
తెలియ దేమి నీకు తెగులు దిగులు.
యవ్వనమ్ము లోన యవ్వారముల జేసి
ఎగిరిపడుదు వీవు నెవరి వినక.॥
4.
మధ్య వయసు లోన మమతాను బంధాల
మరచి పోదు వన్ని మహిని మనగ ॥
సమ్మ తమ్ము నీకు సంసార బంధాలు
సద్దు బాట్ల బ్రతుకు సహన మిడుచు ॥
5.
వృద్దుడైన పిదప వృక్షరాజము వోలె
అనుభవాలె దలతు వణగి యుండి.
ఇదెగ బ్రతుకు రీతి ఈతి బాధల తోటి
ఇలను జీవితమ్మె ఇరుసు సుమ్మి ॥
హామీ : ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితము కాని నా స్వీయ రచన.
No comments:
Post a Comment