Tuesday, September 27, 2022

రుబాయిలు


అంశం : రుబాయిలు.
శీర్షిక : మా మొరలు వినుమమ్మ.
రచన :   
శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.


న్యాయస్థానాల్లో వాదోపవాదాలు
 స్త్రీల ఆరక్షణకు సంక్షేమపథకాలు
 కల్లబొల్లి బాసల  కపట రాజకీయం
శీల రక్షణలకై  స్త్రీలిడె నినాదాలు ॥

గుడిలోన స్త్రీ ముార్తి విగ్రహారాధనలు
అవనిలో స్త్రీ ముార్తికంగాంగ శోషణలు
 చుాసేందుకై కనులు న్యాయానికి లేవుగ
మార్పురాని తీర్పుకు స్త్రీల ఆక్రోశాలు ॥

భువిలోన మాబ్రతుకు గనుమమ్మ  బతుకమ్మ ॥
 మనసార మామొరలు వినుమమ్మ బతుకమ్మ॥
నీవుగాకించెవరు  దిక్కు మాకీ  భువిని
మముగాచు దేవివై మనుమమ్మ బతుకమ్మ॥


పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు -1

న్యాయస్థానం లో వాదోప వాదాలు స్త్రీ ల రక్షణ వట్టి మాటలు అంటూ.. బ్రతుకమ్మ కు మొరలు..మీ రుబాయీలకు అభినందనలు 🙏💐👌

No comments:

Post a Comment