శీర్షిక : ఎత్తిపట్టిన ఎర్ర జండా .
రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
పుట్టు కెందుకో మరి గిట్టు టెప్పుడో
తెలియని మానవ జన్మిది పుడమిని.॥
హెచ్చు తగ్గు వ్యత్యాసాల బాడుగు
బ్రతుకుల జనమిది ॥
మంచి మాట, మనసు కోరి బ్రతికెదరు కొందరు.
మంది కొరకు ప్రాణాలనె పణ మిత్తురు కొందరు ॥
అన్యాయమరాచకమ్ము సహియించరు కొందరు.
న్యాయమైన మాట,బాట ఉద్యమించెదరింకొందరు ?
జాతి మతము యేదైనా కుల వృత్తులు యేవైనా..
అన్యాయము నెదిరించి పోరు వీరులు మరి కొందరు..॥
రాచరికం, భూస్వామ్యం కలగలసిన నీచత్వము
కర్కశ పొరుకు నలిగిన దాసులుగా మారిన జనము॥
కాలం తీర్పుకు పుట్టిన పోరు బిడ్డ ఈయమ్మ
తెలంగాణ ముద్దుబిడ్డ చాకలి ఐలమ్మ ॥
చిట్యాల నరసయ్యకు ఈడు, జోడు, తోడు గా
ఏడ్గురు బిడ్డల తల్లిగ చాకలి ఐలమ్మగా॥
బ్రతుకు పోరాటాల బాట దుక్కి దున్ని జంటగా
కౌలు భుామి సాగుజేసె కడు కష్టపు జీవిగా॥
వెట్టి చాకిరీల తీరు బాంచనన్న జనుల గోడు
పరాధీనమౌ బ్రతుకుల వెలుగు నింప గోరె జుాడు ॥
పాలకుర్తి పట్వారీ పప్పులుడకనీయక
సివంగిలా గర్జించిన ఐలమ్మే నాయిక. ॥
కొంగు చుట్టి కొడవలెత్తె చాకలి ఐకమ్మ దురుసు
అలుసు జేయు నిజాం దొరలకైలమ్మే కంటి నలుసు ॥
ఆత్మవిశ్వాసము నిండుగ ఐలమ్మే అడుగిడగా
నిజాం దొరల పింఛ మణచ కుాడిరి జనులండగా...॥
ఆంధ్రమహా సభల జోరు కమ్యూనిస్టుల హోరు
రజాకార్ల తీరు నణచ -నైలమ్మే సలిపె పోరు..॥
భుామి కొరకు భుక్తి కొరకు పుార్తి దాస్య ముక్తి కొరకు
ఆశయమే స్వాశగ నైలమ్మ బ్రతికె జనుల కొరకు ॥
ఆడ పులిగ ఐలమ్మే ఎత్తిపట్టె నెర్రజెండా ॥
తెగువ బిగువ పోరు సలిపె వెట్టిచాకిరీలు ముగియ ॥
పదునెక్కిన పోరాటం
కొమరం భీం, బందగుల రక్తతర్పణం
బీజం పడిన తెలంగాణలో సాయుధ పోరాటం ॥
ఎగసి పడిన ఉద్యమాలు వెల్లువైన పొిరాటాలు
ఎరుపెక్కెను ఆఝండా ఎగిరి పోరె నాతండా ॥
అమరత్వం పొందినది ఐలమ్మ పోరాటం
పుస్తకాలకే పరిమితమై నిలచె నామె ఆరాటం ॥
పింఛనుకైనా నోచుకోని జీవితమామె చరితం
చాకలి ఐలమ్మ స్ఫుార్తి.. మనకు ఘనం నిరంతరం ॥
************************************.....
No comments:
Post a Comment