Tuesday, September 13, 2022

బతుకు జట్కా బండి

09/09/2022.
శ్రీ శ్రీ కళావేదికలో
అంశం : బ్రతుకు జట్కా బండి.
శీర్షిక  : మారుతున్న కాలంలో మనిషి బ్రతుకు.

రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.


జీవిత చక్రం  ఒడిదుడుకుల పట్టాలపై 
గమ్య మెరుగని బాటలో చేసే ప్రయాణం.
సుఖ సంతోషాల వెతుకులాటలో 
అలసిన జీవితాల ఆక్రోశం ॥

అధికార దాహపు అహంకారం
ప్రజల బలహీనతలకు వెలకట్టి
నోట్లు కురిపించి  ఓట్లను  కొని
అక్రమాల బాటలో అల్లర్లు సృష్టి స్తున్నాది ॥

గద్దెకెక్కిన  ఘనులందరుా దేశ సంపత్తిని 
వేలం వేస్తుా  భరత భవితల జీవితాన్ని 
బ్రతుకు వేదనలకు గురిచేస్తున్నారు॥

 స్వార్ధం   నిండిన మనిషి జీవితం
 ధన దాహానికి బానిసై తన - పర అనే
బంధాలకు  ఉద్వాసనలిడింది .
ఆటవిడుపులేని అహం హద్దులు దాటింది ॥

మారుతున్న కాలం తో పాటు 
మారే మనుషుల మనస్తత్వం 
మగువ  మదిరలకు దాసొిహమై
బంధానుబంధాలను మట్టి కరిపిస్తోంది ॥
 
అడిగినవాడు అసలు పత్తా ఉండడు.
అడగనివాడికి అసలు బ్రతుకే ఉండదు.
భయం నిండిన బడుగు జీవితాలు
బ్రతుకు తెరువు లేక బానిసలౌతున్నారు॥

 బానిసత్వపు సంకెళ్ళు విడిన ఆనందం 
 అనుభవంలోకి  వచ్చిందన్న భావం
 తలపులో మలుపు తిరగకు ముందే
 మాట, స్వాతంత్ర్యాన్ని కోల్పోయింది ॥

బ్రతుకు జట్కా బండిలో  నలిగిపోతున్న 
జనుల చితుకు జీవితాలకు  ముక్తి లేదు.
మననుద్ధరించేందుకు మరో  ఉద్యమ వీరుడు
మళ్ళీ ఈ భువిలో పుట్ట బోడు ॥

*************::*********************

No comments:

Post a Comment