29/09/2022.
శ్రీ శ్రీ కళావేదిక కవితల పోటీ కొరకు...
.అంశం : ఆమె.
శీర్షిక : ఆమె అలుపెరుగని ఆమని.
రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
అమ్మ కడుపులో నవమాసాల అనురాగపు పంట.
అమ్మా నాన్నల ఆనందం ఆ చిన్ని పలుకుల వెంట.
పెరుగుతున్న ఆ వయసుకు సింగారాలెే సిరులంట.
కలల రేడు కవ్వించగ పుార్తి చంద్ర కళలవంట.॥
పుట్టినింటి కీర్తి పెంచు పుత్తడియిా..బొమ్మంట
మెట్టినింటి సాంప్రదాయ మేలు సుగుణములంట
భర్త లోన సగము భార్య అను మాట నిదర్శనమై.
కష్ట-సుఖముల కావిడి తా మొాసే తరాజంట ॥
ఇంటి బాధ్యతలకిరుసై తిరిగే పని రాట్నమంట.
తనయింటి వారసులను దీర్చి దిద్దు గురువంట ॥
పరువు బరువు బాధ్యతలను మొాసే గతి చక్రమంట
సుఖ సంతోషపు పంటలకిడు సారము తానేనంట ॥
చదువు లెన్నొ చదివి తెలివి రాజ్యాలేలిన కలిమి
వత్సరముల భరతమాత కీర్తి నిలుప నామె బలిమి
అబలకాదు సబలామె అనుభవ పాఠాల కొలిమి
చిరునవ్వుల పుాలజల్లు కురిపించే ఆమని ॥
నిండు చీరకట్టు బొట్టు నిత్య పుాజ లింట వెలుగు
సిరి సంపద లింట కలుగుటకామే సరి నిల తుాగు
జీవిత భాగస్వామిగ జీవితాంత సహచరిణిగ
పురుషుల భాగ్య రాశిగ పుట్టెను పడతే కొలువుగ॥
సంద్రపు లోతులేలు మనసు లోన కల్లోలము
కనిపరచని శాంత ముార్తి సాహితి సంగీత వాణి
ఆమె విలువ గట్టలేము ఆమె సాటి మెలగలేము
ఆమెలేని ప్రకృతిలను సంతోషమె సుాన్యము ॥
No comments:
Post a Comment