⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
10/09/2022.
నేటి బాలభారతంలో
అంశం : "జ" గుణింతంతో కవిత..
శీర్షిక : జగతి నెరిగి మసలుకో తమ్ముడా...
(గేయ రచన )
రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
జనని జన్మ భుామియే మనదిరా
జయ జెండా కీర్తి నీవు నిలుపరా
జనని ఋణము దీర్చు కొనర బాలకా
జగతి నీదు జన్మ సార్ధకమ్మురా ॥ జ
జనకు నాజ్ఞ పాటించీ ఎదగరా
జయము లేలగా చదువులు చదవరా
జగమున కీర్తుల బడసిన వాడవై
జన్మ సార్ధకమ్ము జేసుకొమ్మురా ॥
జుట్టు ముట్టు వెతలకు భయపడకురా
జాగురుాకతను తెలిసి మెలగరా
జీవితమే వికసించిన సుమమురా
జాతి ముత్యమై నిలువర తమ్ముడా .॥
జాతీయ గీతి మనకు ముద్దురా
జాతి భేదముల జుాపకు తమ్ముడా
జుాడ పెరుగు కాలుష్యము నాపగా
జగతి చెట్లు నాటి బాట చుాపరా ॥
జలము కలుషితమ్ము నీవు జేయకురా
జల జీవుల వేధించీ చంపకురా... .
జంతువులను ప్రేమిచర తమ్ముడా...
జేయు నీకు మేలు నిజము సుమ్మిరా...
జానపదపు గీతులే నీవు పాడరా
జ్ఞాన వేద సంస్కృతియే మనదిరా
జగతి సంస్కారములను నేర్వరా
జయము లెన్నో భువిని నీకు కలుగురా ॥
జేగంటల గుడిగంటలు వినుమురా
జోతలిడుచు భగవంతుని వేడరా .
జనగణమణ దేశ భక్తి గీతిరా
జనని పుణ్య భుామి మనదె తమ్ముడా.॥
ఈ కవిత నా స్వీయ రచన .
*******************
*మహతీ సాహితీ కవిసంగమం -కరీంనగరం*
*బాలసాహిత్యం: ఉత్తమ కవితలు (10-09-2022)*
శ్రీ/శ్రీమతి:
1.జూపూడి సుధారాణి
2.ఈతకోట ఏడుకొండలు
3.త్రిలోచన్ బిసాయ్
4.విటిఆర్ మోహన్ రావు
5.పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి
6.పొర్ల వేణుగోపాలరావు
7.కుడికాల సమ్మన్న
8.పోగుల భాగ్యలక్ష్మి
9.దేవనపల్లి ఓగన్న
10.డా.పి యస్ యస్ లక్ష్మి
నిర్వాహక/సమీక్షక బృందము
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
No comments:
Post a Comment