సమదర్శిని పత్రిక వారి ఆధ్వర్యంలో
మడిపల్లి స్మారక ఈ సంకలనం కొరకు..
అంశం: మడిపల్లి భద్రయ్య సాహిత్యం - జీవితం
శీర్షిక : ఇరుసు వంటిది జీవితం .
ప్రక్రియ : ఆటవెలది పద్యాలు.
రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
1.
జీవితమ్ము నీది జీడిమా మిడిపండు
జీడి వలెను దాగు జిక్కులన్నీ
పారవేయ టెంక పండు తీపిగ నుండు
అదియె సుాత్ర మిచట నాచ రించు ॥
2.
నాల్గు దశల లోన నలిగిపోవును జీవి
కష్ట నష్టములవి కావిడంచు
దుఃఖ బాట వెంట సుఖముండు గనవేమి ?
మనసు బెట్టి పోర మరలి పోవు ॥
3.
బాల్య తనము నందు బడికిపో వువరకు
తెలియ దేమి నీకు తెగులు దిగులు.
యవ్వ నమ్ము లోన యవ్వారముల జేసి
ఎగిరి పడుదు వీవు నెవరి వినక.॥
4.
మధ్య వయసు లోన మమతాను బంధాల
మరచి పోదు వన్ని మహిని మనగ ॥
సమ్మ తమ్ము నీకు సంసార బంధాలు
సద్దు బాట్లు మనుచు సహన మిడుచు ॥
5.
వృద్దు డైన పిదప వృక్షరాజమువోలె
అనుభ వాలె దలతు వణగి యుండి.
ఇదెగ బ్రతుకు రీతి ఈతి బాధల తోటి
ఇలను జీవితమ్మె ఇరుసు సుమ్మి ॥
హామీ : ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితము కాని నా స్వీయ రచన.
No comments:
Post a Comment