అంశం : రుబాయిలు.
శీర్షిక : నీవేరా నా మదిలో...
రచన : శ్రీమతి :
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర
వేణునాదాన్ని విని రేయంతా పాడింది రాధ
మురళీధరు గని ఆనందంతో ఆడింది రాధ.
మనమొాహనుడదె యమునావిహారి అందరివాడుగ
విరహముతోనదె రా-రమ్మంటుా వేడింది రాధ ॥
రేయంతా నిదురలోన కలవరింత నీదేగా
రోజంతా మనసులోన పులకరింత నీవేగా
వెన్నదొంగ వెదకినంత కానరాడె చిన్ని క్రిష్ణ
ఎదురుపడగ పరవశాన పలకరింత నీకేగా ॥
No comments:
Post a Comment