శీర్షిక : శ్రీ రాజ రాజేశ్వరీ చరితం.
ప్రక్రియ : వచన కవిత .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
యోగనిద్ర నుంచి లేచిన విష్ణువు కొన్ని వేల సంవత్సరాలు మధుకైటభులనే రాక్ష సులతో యుద్ధం చేసి కుాడా వారిని ఓడించ లేకపోయాడు .
పరిస్థితిని గమనించిన మహాదేవి ఆ రాక్షసులను మోహపూరితులను జేయగా వారు
శ్రీహరి చేతిలో తమ మరణం తధ్యమని గ్రహించి తమను నీరు లేనిచోట చంపమని కోరగా ,
మహామాయ పదితలలతో, పది కాళ్లతో, నల్లని రూపుతో మహాకాళిగా ఆవిర్భవించి శ్రీ మహావిష్ణువుకు సహాయపడి రాక్షస సంహారం చేసింది.
నందా అనే పేరుతో నందుని ఇంట ఆవిర్భవించి శ్రీకృష్ణుడికి కంస సంహార సమయమున సహకరించినది . సింహవాహినిగా మహిసాసుర మర్దనియై, సరస్వతీ రూపిణిగా సుబ, నుసుంబులను , ఛండ ముండులను సంహరించిన ఛాముండియై, లోకాలను కరువునుంచి రక్షించినందుకు శాఖాంబరియై, దుర్గుడు అనే రాక్షసుడిని సంహరించినందుకు దుర్గగా ఇలా నవరూపాలనెత్తిన అమ్మవారి పదియవ అవతారం శ్రీ రాజ రాజేశ్వరీ దేవి .
నవరాత్రుల్లో 10వ రోజును విజయదశమిగా
మనం ఈ తల్లి యవతారాలకు పుాజలు చేసుకుంటాము.
మన పురాణాల ప్రకారం దేవతలకు పాల సముద్రము నుంచి అమృతభాండము బయటపడినటువంటి రోజునే విజయదశమి రోజుగా చెప్తారు.
త్రేతా యుగంలో రావణాసురుని శ్రీరాముడు సంహరించిన రోజును,
ద్వాపర యుగంలో అజ్ఞాతవాసం తరువాత
కౌరవులపై విజయం పొందినటువంటి రోజు ఈ విజయదశమి రోజు కావడం విశేషం.
ప్రజల పాలిటి కొంగు బంగారమై నిత్య పుాజలనందుకుంటున్న శ్రీరాజరాజేశ్వరీదేవి
ఎర్రటి వస్త్రాలను ధరించి చతుర్భుజాస్త్రధారిణియై
శ్రీ చక్ర రాజము పై రాజిల్లే శివార్ధాంగ స్వరుాపిణి..
రాత్రి సమయంలో
పుార్ణిమ తిథియందు నల్లకలువలు ఎర్రటి పుావులు
పసుపు- కుంకుమలతో తొమ్మది వత్తులు కలిగిన నువ్వుల దీపారాధన గావించి, ధుాపాది నైవేద్యాలను సమర్పించి నిష్ట నియమ ములతో అర్చించిన వారికి సకల పాపములు తొలగి, సర్వ సిద్ధులు ప్రాప్తిస్థాయని అంటారు.
తిథి వార నక్షత్రాదులతో, దుర్ముహుార్త- వర్జ్యములతో,
సంబంధములేక పుాజలందుకొనే దివ్య మంగళస్వరుాపిణియైన శ్రీ రాజ రాజేశ్వరీదేవికి
మంగళమ్ములిడుచుా ఇదే నా శరణాగతి.
No comments:
Post a Comment