05/11/2022.
బాల సాహిత్యంలో కవిత-
అంశం :"మ " గుణింత పదాలతో ..
శీర్షిక : మెళకువలను తెలుసుకో..
ప్రక్రియ : గేయ కవిత .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
పల్లవి .
-------
ముద్దుగారు పిల్లలుా మురిపాల గువ్వలుా
మేలైన మాటలా మెళకువలివె పిల్లలుా
మంచి మనసు మీదిగా మనిషిగా మెలగాలి
మంచి విద్య- జ్ఞానముతో మీరందరు ఎదగాలి.॥ ॥
॥ముద్దు ॥
అను పల్లవి :
-----------
మదిని మానవత్వమే మనుగడ నిల నిలుపునుా
మమత పెంచు మంచి గుణమె మీభవితను దిద్దునుా
మాటల కోటలుగట్టి నవ్వులపాలవకండి
మాట డాబు వద్దండీ చేత చేసి చుాపండీ ॥॥ముద్దు ॥
చరణం:
------
మాట తీరుగుండాలి మేలు బాట నడవాలి
మార్గదర్శులవ్వాలి మంచి తనముతో
మన దేశం మన ఝండా మాట కీర్తి మారుమొాగ ॥మరపురాని విధముగా మసలుకోండి
మాత- పితలు కలలు కన్న మహోన్నత వ్తక్తులై-
మహిని మేలు కీర్తి బాట మీరందరు నడవాలి.॥ముద్దు ॥
చరణం.
---------
మరపురాని చేతలతో మన్ననలను పొందుమా
మంచి చెట్లు నాట మహిని, పొివు కాలుష్యమమ్మ.
మంచి నీటి విలువ తెలిసి వృధా పోనీయకుమా
మన అన్న దాతలకు నీటి కొరత రానీకుమ
మన సంస్కృతి సాంప్రదాయములను గౌరవించుమా.
మనిషి సంస్కారముతో మసలుటలే ధర్మముసుమ॥॥ముద్దు ॥
చరణం.
-------
మనుషులను మొాసగించి మిత్రుల కోల్పోకుమా
ముప్పు దెచ్చసత్యమదే మరచి యాడబోకుమా
మాటదప్పినట్టి యాన లెన్నడు చేబోకుమా
మరపు రాని మనిషిగా మదిని నిలినిపోవమ్మా
మనువు చెప్పు ధర్మములివి మనిన మచ్చ రాదుసుమాl
మంచివ్య క్తిత్వమున్న మనిషే మహనీయుడమ్మ ॥
॥ముద్దు ॥
No comments:
Post a Comment