శీర్షిక: జ్ఞాన పెన్నిధి.
ప్రక్రియ : మత్తకోకిల పద్యాలు
రచన : శ్రీమతి :
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర.
పుస్తకమ్మది పుార్తి జ్ఞానము నిచ్చు పుాజ్యమౌ పెన్నిధి
హస్త మందున భుాషణమ్మిది మస్తకమ్ముల నేలిదీ
నేస్త మైనది శ్రేష్టమైనది నేర్పు సుాక్తుల స్ఫుార్తిదీ
వాస్తవమ్ముల దెల్పు వాజ్మయ నీతి బోధల బెమ్మిదీ ॥
రాణి వాణికరాబ్జ మేలిన రాసిపోగుల సొమ్మిదీ
బాణి కట్టిన కీర్తు లల్లుచు భాష లేలిన వాసిదీ
ఆణి ముత్యపు అక్ష రాలకు ఆశ్రయమ్మిడు దాతిదీ
పాణి భుాషణి పుస్తకమ్మిదె పాత్ర లేలిన పల్కిదీ ॥
తాళ పత్రపు గ్రంథరాజపు తావు లేలిన మేటిదీ
మేళ వించిన గద్య పద్యము లేలు మంగళ దీప్తిదీ .
వేళ వేళల మార్పు చెందిన వేల ఠావుల గుత్తిదీ
కాళ రాత్రులజ్ఞాన చీకటి కాల్చు జ్ఞానపు జ్యోతిదీ॥
ఛాత్ర బాలల సవ్యజీవన ఛాయ యైన సుబోధినీ
స్తోత్ర రుాపిణి భక్త పోషిణి గాత్ర జ్ఞాన వికాశినీ
మాత్ర వ్యాకరణీ సుబోధిని మాత అక్షర పోషిణీ
పాత్ర వేదపురాణి వాజ్మయి పాహి పుస్తక రుాపిణీ ॥
కీర్తినేలిన మంత్ర మాతృక సుాక్తి పంక్తుల వేదమా
పుార్తి యొాగపురాణ గీతగ పుాజ లందిన భోగమా
స్ఫుార్తి సాహితి ఆక్షరాకృతి ముార్తి వాణి సందేశమా
పుార్తి జ్ఞానము నిచ్చు పెన్నిధి పుస్తకమ్మదె మిత్రమా॥
No comments:
Post a Comment