Thursday, November 17, 2022

పుస్తకం పద్యాలు

మహతీ సాహితీ కవిసంగమం
తేది:*16-11-2022*
అంశం : పుస్తకము.
శీర్షిక: జ్ఞాన నిధి

ప్రక్రియ :  ఆటవెలది పద్యాలు
రచన : శ్రీమతి :
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర.

పొత్త మందుగలవు పొందు జ్ఞాన నిధులు
విత్త మందు లేదు విహిత కర్మ
చిత్త మందు  దలచి చిన్మయానందుని
సొత్తు జేసు కొనుమ పొత్త మదియె ॥

వేల వేల్పు లిలను వెలసేటి చరితలు
గ్వాల గోప బాల లీల ఘనత
జేలు పొందినట్టజేయ ముార్తుల గాథ
లేలు పొత్త మదియె మేలు సుమ్మి ॥

చదువు లెన్నొ చదివి చరిత కెక్కని రీతి
విధము మనిననేమి విశ్వ మందు
అధములౌచు జనులు యాదర్శ ములవీడి
మథన పడిన బ్రతుకు మట్టి పాలు ॥

జ్ఞాన ధనము నొసగి  జ్ఞాన సారము దెల్పు
ధ్యాన ధర్మ బాట ధరణి మనగ
పాన మదియె జ్ఞాన ఫలము పొత్తముసుమ్మి
ఆన, పుస్తకమ్ము యదియె ఘనము॥

******

1️⃣5️⃣

మహతీ సాహితీ కవిసంగమం
తేది:*16-11-2022*
అంశం : పుస్తకము.
శీర్షిక: జ్ఞాన నిధి

ప్రక్రియ :  మత్తకోకిల పద్యాలు
రచన : శ్రీమతి :
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర.

పుస్తకమ్మది పుార్తి జ్ఞానము నిచ్చు పుార్వపు పెన్నిధి
హస్త మందున భుాషణమ్మిది మస్తకమ్ముల నేలిదీ
నేస్త మైనది శ్రేష్టమైనది  నేర్పు సుాక్తుల స్ఫుార్తిదీ
వాస్తవమ్ముల దెల్పు వాజ్మయ నీతి బోధల బొమ్మిదీ ॥

రాణి వాణియె పట్టి యేలిన రాసిపోగుల సొమ్మిదీ
బాణి కట్టిన కీర్తు లల్లుచు   భాష లేలిన వాసిదీ
అణి ముత్యపు అక్ష రాలకు ఆశ్రయమ్మును ఇచ్చినా
పాణి  భుాషణి పుస్తకమ్మిదె  పాత్ర లేలిన పల్కిదీ ॥

తాళ పత్రపు గ్రంథరాజపు  తావు లేలిన మేటిదీ
మేళ వించిన గద్య పద్యము లేలు మంగళ గౌరిదీ
వేళ లందున మార్పు చెందిన వేల ఠావుల గుత్తిదీ
తాళబ్రహ్మయె రాత రాసిన మేళవింపుల మాలిదీ॥

ఛత్రమైనిల బాల బావిసు గాత్రమై విలసిల్లినా
మిత్ర రుాపిణి స్తొిత్ర పోషిణి  క్షేత్ర  జ్ఞాన వికాశినీ
జైత్ర  యాత్రల జేల నందిన జైసు వాజ్మయి రుాపిణీ
చిత్ర పుస్తక రుాపి చిన్మణి చిహ్న జ్ఞాన ప్రదాయినీ ॥


No comments:

Post a Comment