Sunday, November 6, 2022

రుబాయిలు

మహతీ సాహితీ కవి సంగమం.
 25/10/2022.
అంశం : రుబాయిలు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర .

పొత్తిళ్ళలో పొందికగాను  పెంచిందమ్మ.
ఆకలిదీర్చి అందంగాను పెంచిందమ్మ 
తల్లి ఋణాన్ని తీర్చుకొనుటకు వెనుకాడొద్దు 
ఇలదేవతగ హుందాగాను వచ్చిందమ్మ ॥

జీవితాన తప్పటడుగు లెప్పటికీ  వేయబోకు.
తెలిసితెలిసి  తప్పులవి యెప్పటికీ చేయబోకు
అంతరాత్మ సాక్షి, నిన్ను నిలదీయును.
మనసునెపుడు మొాసబుచ్చి ఎప్పటికీ బ్రతుకబోకు ॥

అవసరమని  అబద్ధాల  నాడబోకు.
స్వార్ధంతో  బంధమ్ముల  వీడబోకు ॥
మంచితోడ , అందరితో కలిసుండుము.
 నమ్మించీ  మొాసమ్ముల  చేయబోకు.

 

నీతులనవి నిర్లక్ష్యం  చేయబోకు
ఎవ్వరినీ అవమానము పరచబోకు
అవసరాని కందరినీ  ఆదుకొనుము
మంచిమాట పెడచెవులను పెట్టబోకు॥

******************************

No comments:

Post a Comment