Sunday, November 13, 2022

గ్రహణం.

శీర్షిక  : గ్రహణం.
*రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర

యుగాల నుండీ ఏర్పడిన ఖగోళ రుాపం. 
విజ్ఞానానికి అంతుపట్టని  అగ్నిగోళాల ఆవిర్భావం
ఆకాశంలో నవగ్రహ మండలాల అద్భుత తేజం . 
మానవ, జీవ, జంతు, జీవితాలపై ప్రభావం॥

ఆకాశంలో భగవంతుని వాసమన్న నమ్మకం.
యుగానికో అవతారంతో భగవంతుని దర్శనం  .
దుష్ట శిక్షణంతో శిష్ట రక్షణల కథనాలనంతం.
పురాణ కావ్య కథనాలపై మనిషి విశ్వాసం॥

ప్రతీ రాతిని, నీతిని నమ్మే జనం ...
నిత్య జీవితాల్లో పాటించని ఆచరణలనేకం.
మనవైన సంస్కారాలను మన్నించని నిర్లక్ష్యం .
ముాడ నమ్మకాల  మొక్కుబడులతో ముార్ఖ జనం.

విజ్ఞానం ఛేదించలేని శక్తులతో నిండిన గగనం.
అనేకానేక గ్రహకుాటములతో  అనంత విశ్వం .
నక్షత్రాది,సుార్య- చంద్రాదులతో నిండిన అగ్నిగోళం 
భుామిని మించిన వైశల్యంతో అనంతాకాశం॥

లెక్కకు తేలని నక్షత్ర కుాటమిల వెలుగులు.
వాసయొాగ్యం కాని ధుాళి నిండిన బండలు.
స్వాశ ఆడని తాపం , నీరు కానరాని వైపరీత్యం
భుామికి కొన్ని యొాజనాల ఎత్తులో అసాధ్యపు సాధ్యం ॥

వైజ్ఞానిక మార్పులతో సుార్య, చంద్రుల గమనం.
భుామ్యాకర్షణ శక్తి వల్ల ప్రకృతిలో  వైపరీత్యం 
విష వాయువుల ప్రభావానికి భుామిలో అల్లకల్లోలం.
జీవ జంతుల ఆరోగ్యానికి  హానిజేసే వాతావరణం ॥

సుార్య చంద్రుల నీలి నీడల ప్రభావానికి 
అస్పష్టమైన గ్రహాల కదలికల పరిణామం .
దృశ్య రుాపంలో కనిపించే చిత్రానికి 
మనిషి చేసిన  నామకరణం గ్రహణం .
కాలుష్యాన్ని  పెంచే విషపుారిత వాతావరణం ॥
 
రెండు గ్రహాలు  ఒకే కక్ష్యలో  చేరి 
ఒకటికి మరొకటి ఎదురెదురుగా వచ్చిన 
పరిణామం.
నేటికీ విజ్ఞాన వంతులకు అంతుచిక్కని
పరిశోధనలకు నిలయం.॥

మన ఋషులు మునులు అనుభవాల 
ఆలోచనలతో చేసిన పరిశోధనలనంతం.
విజ్ఞాన పరంగా పుార్వకులు రచించిన 
శాస్త్ర గ్రంధాలలో నిబిడిన ఆరోగ్య  సుాత్రాల సారం.

విద్యా జ్ఞాన వికాశాలకై
 మునులు రాసిన కావ్యాలనంతం.
చదువరులకు మార్గదర్శకమైన 
పుస్తక పఠనంలో ప్రతీ ఒక్కరి జీవితాలకు
మార్గదర్శకమైన మహత్తర  సందేశం.

భుామ్యాకాశాల మధ్య గల ప్రపంచం.
పంచ భుాతాలపై ఆధారపడిన 
జీవన్మృుత్యు సంఘర్షణల మానవ  జీవితం ॥
బ్రతుకు కాలమంతా ప్రకృతి పై ఆధారం ॥

కాలుష్య రహితమైన ప్రకృతి మధ్య  ప్రయాణం .
మనిషి జీవితానికి పంచ భుాతాలు ఒక వరం.
పరిశోధనల పేరుతో వినాశనానికి చుట్టిన శ్రీకారం 
మనిషి చేతుల్తో కాలరాయబడుతున్న  కాలం
మట్టిలో మనిషి జీవితం ,మారణ హోమాల వలయం .॥

పాశ్ఛాత్య పద్ధతులకు లోబడిన జనం.
పౌరాణిక గ్రంధాలను చేసుకోక మననం.
యుగాల సంస్కృతిని చేస్తున్నారు ఖననం.
ఇదేగా మనిషికి పట్టిన అసలైన గ్రహణం ॥



.

No comments:

Post a Comment