Wednesday, November 9, 2022

విజ్ఞతెరిగి మసలుకో

09/11/2022.
మహతీ సాహితీ కవి సంగమం .
అంశం : న్యాయం.
శీర్షిక : విజ్ఞతెరిగి మసలుకో..

ప్రక్రియ : ఆటవెలది పద్యాలు.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర 

మంచి బాట నెంచి మహిలోన  మసలేటి
మనిషి కాన రాడు మాయ గాదె
స్వార్ధ మెంతొ పెరిగె స్వావలంబన తగ్గి
 మాట మరచె న్యాయ బాట మరచె ॥
 
 చేసి దుష్కృుతములు చేసి యన్యాయమ్ము
 కుాడ బెట్టి సొమ్ము కుళ్ళ బెట్టి
 ప్రజల ఉసురు తగిలి ప్రారబ్ద కర్మలా
 రోగు లౌచు బ్రతుకు రోయ వగచె ॥
 
 ధర్మ చింతనేల ధన్యు డౌదువు నీవు
 న్యాయ మార్గ మిడిన మేయ కీర్తి
 మెచ్చు జనులు నిన్ను మేటి గుణుడవంచు
 శాంతి సుఖము లొసగు సార మదియె ॥
 
 మహిని న్యాయ బాట మదిని ధర్మపు చింత
 మనసు కిచ్చు శాంతి , మహిని సుఖము
 యశము లిచ్చు మేటి  యజ్ఞమ్ము  న్యాయమ్ము
 మరువ కెపుడు న్యాయ మార్గ మిలను ॥
 
********
 
మంచి బాట నెంచి మహిలోన  మసలేటి
మనిషి కాన రాడు మాయ గాదె
ధరణి గాచు నిధులు  ధర్మ - న్యాయములేగ
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥

చేసి దుష్కృుతములు చేసి యన్యాయమ్ము
 కుాడ బెట్టి సొమ్ము కుళ్ళ బెట్టి
 ప్రజల ఉసురు తగులు ప్రారబ్ద మదియేల
 మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
 
ధర్మ చింతనేల ధన్యు డౌదువు నీవు
 న్యాయ మార్గ మిడిన మేయ కీర్తి
 మెచ్చు జనులు నిన్ను మేటి గుణుడవంచు
 మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
 
 మహిని న్యాయ బాట మదిని ధర్మపు చింత
 మనసు కిచ్చు శాంతి , మహిని సుఖము
 యశము లిచ్చు మేటి  యజ్ఞమ్ము  న్యాయము
 మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥

చేయకన్యాయమ్ము చేటు నీకది జేయు.
పాప మదియె పండ  పట్టు చీడ
కర్మ ఫలిత మిలను కడుదుఃఖ తరమురా
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥

నీతి బాటను నడచు నిత్య సంతోషుండు.
ప్రీతి జేసి పనుల ఖ్యాతి బడయు.
సుఖము నిచ్చు బ్రతుకు సుంతైన చాలుగా 
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥


No comments:

Post a Comment