Thursday, December 9, 2021

రామనామ మహిమ

18/04/2021
మనుమసిద్ధి కవన వేదిక కు పంపిన కవిత
అంశం : రామ నామం. కవితాంశం కొరకు...
శీర్షిక  :  రామ నామ మహిమ ( ప్రతిలిపి).

వచన కవిత.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

వైకుంఠ వాసుడైన శ్రీ మహా విష్ణువు.
మానవావతారమెత్తిన శ్రీరాముడు.దుష్ట శిక్షణ  శిష్ట రక్షణ  జేయడానికి అవతరిస్తున్న యుగపురుషుడు.
శ్రీ "మహావిష్ణుని అష్టాక్షరీ" మంత్రంలో ఐదో అక్షరమైన   ‘రా’, "శివ పంచాక్షరీ"  మహామంత్రంలోని రెండో అక్షరం ‘మ’.కలిపితే  రామ శబ్దం నిర్మితమైంది.
మంత్ర  బీజాక్షర శక్తి కలిగిన" రామ "అన్న శబ్దానికి
"ఓం" కారము కుాడా చేర్చ నవసరం లేదు .
గణేశ, శైవ, శక్తి, సూర్య వైష్ణవ మంత్రము-
లన్నింటికంటెనూ అధిక ఫలము "శ్రీ రామ నామ "
జపము వలన కలుగు తుంది."ర" శబ్దము, అగ్ని బీజం   " ఆ" శబ్దము,వాయు బీజం "మ" శబ్దము,ఆకాశ బీజం -ఇటువంటి అగ్ని , వాయ,రాకాశ  బీజ సమ్మిళితమైన " శ్రీ రామ"  నామ మహిమ ఇంతా అంతా
అని చెప్పనలవి కాదు.ఏకపత్నీ వ్రతుడు, పితృ, మాతృ భాతృ, సదాచారం, నిగ్రహం, వంటి
సర్వ సద్గుణాలు మూర్తీభవించిన దయార్ద హృదయుని ," రామ" అన్ననామాన్ని మన-
మందరం జపించి కృతార్ధులమౌదాం.

హామీ: నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితం కాని నా స్వీయ రచన.
******:::***::*********************::::*

15/04/2021
తెలుగు భారతి  సాహిత్య సేవా సంస్థ   -ఎస్ వీ ఫౌండేషన్, ప్రజా సేవలో మనం-శుభోదయం  -జనదీపిక  సంయుక్తంగా నిర్వహిస్తున్న  కవితా వసంతోత్సవం.

*శ్రీరామ నవమి కవితా వసంతోత్సవం*  కు పంపినది
*క్రమ సంఖ్య 127.

శీర్షిక : లోక కల్యాణ కారకుడు.
-------------------------

.లోక కల్యాణార్ధం మానవ అవతారం ఎత్తిన
శ్రీ రామచంద్రుడు , తలిదండృలను ఎలా
గౌరవించాలో , వారి మాటకు ఎంత విలువ
ఇవ్వాలో తెలియపరచేడు.
బాధ్యత గల రాచ బిడ్డగా ధర్మ బద్ధమైన
ప్రజా పాలనఎలా చేయాలో ఆచరించి చుాపేడు.
ఒకే మాట ,ఒకే భార్య అంటుా వైవాహిక
బంధపు విలువలని చాటి చెప్పేడు.
అన్నదమ్ముల ఆదర్శానికి , ఆలు మగల అనుబంధానికి, ధర్మ  పరిపాలనకు ,
దుష్ట -శిక్షణ కు,శిష్ట -రక్షణకు , పేరుగా
శ్రీ రాముని చరితం తార్కాణ మంటారు.
జగద్విఖ్యాతి  గాంచిన "శ్రీరామ నామ జపం"
సర్వ దేవ ,ఋషి ,ముని మానవులందరికీ  ముక్తి,మొాక్ష కారకమని , కలియుగంలో
రమ నామ జపమొక్కటి చాలు , జన్మ తరింపజేయడానికని , వేద శాస్త్ర పురాణ
విదితమైనది. సాక్షాత్తుా  మహాదేవుడు కుాడా
నిత్యం జపించే శ్రీరామ నామాన్ని మనముా
జపించి కృతార్ధుల మౌదాం.
----------------------------------------------

No comments:

Post a Comment