అంశం : రక్తదానం.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.
141.
మహిలో మనుషులు వేరైనా
ప్రవహించే రక్తం ఒక్కటేనన్న
మాటకు నిదర్శనం రక్తదానం
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥
142.
కుల-మతాల తేడాచుాపని సమానత్వం
అందరిలో ప్రవహించే జీవామృతం.
నిజమిదేనని తెలుసుకోవాలి మనం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥
143.
మానవత్వంలో దాగిన యజ్ఞంఫలం.
ధనమిచ్చినా దొరకని మధురసం
అరుదైన పరోపకార వరం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥
144.
పౌష్టికాహారం రక్తపుష్టికి ముాలం.
అహారబలం రక్తశుద్ధి కారకం
రక్తదానం , జీవితమే ధన్యం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥
145.
మనుషులంతా ఒక్కటంటుా నిరుాపించేది
మానవత్వానికి నిదర్శనమై నిలిచేది
రక్తహీనులకు బ్రతుకునిచ్చేది రక్తదానం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥
No comments:
Post a Comment