మారుతున్న కాలం లో నేటి తరం
మనుష్యులు,నేను నాది అన్న భావాలు
నిండిన అంతరంగపుటాలోచనలతో ,
పాప పుణ్యాపు చిట్టాలకు, అపనమ్మకపు
భావనా ముసుగును బలవంతంగా తొడిగి
మనసు చెప్పే మంచి మాటలను
పెడచెవిని పెట్టి బుద్ధి చెప్పిన బాటలో
నడిచి బురద గుంటలో బోర్లా పడుతున్నారు.
పెరుగుతున్న వయసుతో పాటు
అనుభవాల నేర్పిన పాఠాలకు
యవ్వన మదంతో చేసిన అకృత్యాల
కొలిమి మంటలు మనసుకు తగిలి
వేడి వాతలు పడుతుా ఉంటే..
జీవిత కాలపు చివరి క్షణాల్లో
తనవైన బంధాలు తను చేసిన
పనులను తనపైనే ప్రయొాగిస్తుా
చిత్రహింసలు పెడుతుా ఉంటే...
అప్పుడు అర్ధమైంది..నాకు
స్వర్గ నరకాల అనుభవ సారం
మన స్వయంకృత కర్మఫలమేనని.
తెలుసుకొనేసరిగి , జీవత కాలం
సగభాగం పోరాట పొిట్ల గాయాల
సలుపుకు హాహాకారాలు చేస్తుాంటే
నా అన్న ఆప్తులకు దుారమై, హీనమైన
బ్రతుకు బండిని లాగలేక , తిరిగిరాని
"నిన్న" కు న్యాయం చేయలే
పశ్ఛాత్తాప పు పరిహారం కానరాని
తీరని వ్యధతో క్షమాభిక్ష కోరుకుంటుా
రాని చావును రమ్మని కోరుతుా
యమ పాశాన్ని అర్ధిస్తోంది.
No comments:
Post a Comment