Thursday, December 9, 2021

అత్యాశ

[4/2, 11:34] మహమ్మద్ రఫీ. ఈ వేమన: 31/03/2021.
ఈవేమన కవితా నిలయం లో
మార్చి నెల రెండో పక్షం
కవితా పోటీ కొరకు....
అంశం : అత్యాశ .

రచన:శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

శీర్షిక : ఆశ హద్దులు దాటితే....

ఆశ అన్నది ప్రతీ ఒక్క మనిషిలో
 దాగి ఉన్న , దాచలేని నిజం.
 జీవిత రహదారిలో తనదైన పుాలవనంలో
తన వారసత్వం చిగురించి 
పరిమళించాలన్న ఆశ.మితమైన
ఆశ మితిమీరి, బుద్ధి మందగించి,
ఆశ ,సుఖాడంబరాలకు దారి వెతికింది.
ఆశ అడియాశయై ,చేసిన మేధో
సాగర మధనంలో, ప్రకృతి పచ్చదనం 
తరిగి ,భుామి పొడిబారిపోయింది.
రక్షా కవచాల్లాంటి కొండలు విరిగి
రహదార్ల  రుాపానికి రంగులద్దేయి.
సుఖ వాహన ,యంత్రాంగాల వల్ల
పెరిగిన పర్యావరణ  కాలుష్యంతో
కోల్పోయిన రోగనిరోధక శక్తి వల్ల
రోగ భుాయిష్టమైన,  కుళ్ళిన శరీరపు 
 కాష్టాల్లో , ఉద్భవించిన  కణాలు
 మందులేని మహమ్మారిగా మారి
 మనిషి జీవితాన్ని అల్లోకల్లోలం చేస్తున్నాయి.
ఐనా సరే ఆశ మీరిన మనిషి 
 ఇంకా ఏదో సాధిద్దామన్న అత్యాశతో...
 పరుగులు తీస్తునే ఉన్నాడు .


ద్వితీయ బహుమతి పొందిన కవిత.
*శ్రీమతి.పులాభట్ల.జగదీశ్వరీముార్తి *గారికి
అభినందనలు*💐💐💐💐👑👑👑👑👑💐💐💐💐💐💐

No comments:

Post a Comment