శీర్షిక : ఓ...స్త్రీ ...ఓర్చుకో...నవ తెలుగు తేజం కు పంపేను.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
యుగ యుగాల చరిత మారినా
కానీ స్త్రీ ల కన్నీటి తడి ఆరలేదు.
మారుతున్న కాలం
కొత్త మార్పు తో వచ్చి
మగాళ్ళను మృగాళ్ళు చేసింది.
అధికారానికి అండగా నిలచి
ఆగడాలను పెంచింది.
అబలలు సబలలుగా
మారుతున్న మంచి తరుణంలో
మరో కోణంలో వచ్చి మాటు వేసే
మారణ హోమం చేస్తోంది.
స్వాతంత్ర్యం ఇచ్చినట్టే ఇచ్చి
శ్వాశ ఆడకుండా చేస్తోంది.
బాల్య వివాహాల బంధ విముక్తి చేసి
బాలికల శోషణకు దారులు కట్టింది
మానమే.ప్రాణమైన మహిళలను
మానభంగాల చితిలో మసి చేస్తోంది.
సొంతం కాని అందాలకు ఏసిడ్
పుాతలు పుాసి ఏహ్యం కలిగిస్తోంది.
అర్ధరాత్రి స్వాతంత్ర్యం, ఆడదానికంటుా
అంగట్లో బొమ్మ చేసి ఆనంద పడుతోంది.
విధి రాసిన రాతంటుా వీధి పాలు చేస్తుా
వివసత్వపు విందును విరివిగా పంచు తోంది.
మానవత్వాన్ని మంటగలిపి మాన ధనాన్ని
వేలం వేసి ముాకుమ్మడి మృగాలకు
మొాజు పంక్తిలో ఆట బంతిగా అందిస్తోంది
అన్ని విలువలకుా వలువలొలిచిన
కాలానికి, తల్లి ,పిల్ల , వావి వరుస-
పసి ,పడుచు ,ముసలి , మతకల
తేడా చుాపని అధర్మం ఆదర్శ మయ్యింది.
అలో లక్ష్మణా అంటున్న అవని శోకానికి
ప్రకృతి పగిలి ప్రళయ బాట చుాపుతోంది.
ఓ ..స్త్రీ ...ఓర్చుకో..నీ కన్నీటి సునామీలో
శాపగ్రస్థ ఐన కాలం కొట్టుకుపోతుంది.
సమయమాసన్నమైంది.
-------------------------------
శీర్షిక : తస్మాత్ జాగర్త.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
అమర వీరుల విగ్రహాలకు
అడ్డు గోడల గోరీలు
ఉనికి కోల్పోయిన ఖండిత
శిల్పాల ముక్కలు వీధి
రోడ్డులో వింతగా మాయమైన వైనం .
అడవి రాజ్యంలో ఆగంతకులకు
గుళ్ళు- గోపురాలల్లో అభిషేకాలు.
పంచదార తీపి ప్రాణాంతకమై
సుగర్ ఫ్రీ రుాపాంతరాలుగా
మారిన తీపిమాటల చేటు చేతలు.
అడిగినవాడికి పిడి గుద్దుల సుద్దులు.
వంత పాడిన వాడికి వరుస ముద్దులు.
అక్రమాల దారుల్లో నిరంతర పుాలజల్లు.
అత్మ సమర్పణల త్యాగ నిరతికి
అసమానత గుచ్చిన అవమానపు ముల్లు.
విధాత రాసిన కర్మ విల్లును ,
వితండవదంతో తిరిగి రాసిన
బిల్లును కట్టలేక, నోట్లకు ఓట్లను
అమ్ముకుంటున్న ఓటర్లు బానిసత్వపు
బంధాల్లో పడుతున్న శాపానికి
శోకంతో బొక్క బోర్లా పడిన
భరత మాతను తిరిగి లేవనీయని
ఉక్కు పాదం ఉరకలేస్తుా
దేశాన్ని దోచుకుంటోంది .
తస్మాత్ జాగర్త..
No comments:
Post a Comment