శీర్షిక : చాటు పద్యాలు.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
కొండవీటి ప్రభువు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానకవి యైన శ్రీనాధుడు ఓనాడు సర్వజ్ఞ భుాపాలుని దర్శనార్ధం వెళ్లేడు.
పెదకోమటి వేమారెడ్డికినీ , సర్వజ్ఞ భుాపాలునికినీ మధ్య నున్న వైరం తెలిసిన శ్రీనాధుడు .
సర్వజ్ఞ భుాపాలుని ఆస్థనంలో
" శివునికి , మీకుా తప్ప సర్వజ్ఞ భుాపాలుడను నామం మరెవరికుంది. " అనే పొగడ్త గల పద్యం చదివి , ప్రశంసాది సత్కారాలందుకున్నాడు లందుకున్నాడు .
అతడు చదివిన పద్యమిది.
"సర్వజ్ఞ నామధేయము
శర్వునకే , రావు సింగ జనపాలునకే,
యుర్విం జెల్లును , దక్కొరు
సర్వజ్ఞుండనుట కుక్క సామజ మనుటే ॥
సర్వజ్ఞ భుాపాలుడను శ్రీనాధుడు పొగడిన మాటవిని మండి పడుతున్న
పెదకోమటి వేమారెడ్డి దగ్గరకు వచ్చిన శ్రీనాధుడు, అదే పద్యంలో రెండవ పాదం లో
జనపాలున .."..కేయుర్విన్ జెల్లును.".అని చదివి వినిపించి , మీకు విరోధియైన ఆతనిని ఈ విధంగా తిట్టి వచ్చేనని చెప్పి, ఆతనిచే సన్మానాలందుకున్నాడు.
ఈ విధమైన చమత్కారం "సమయొాచితంగా మరెవరికైనా వస్తుందా" అనిపించేంతగా ఆశ్ఛర్యం కలిగించే విధంగా ఉంది కదుా..
ఈ పద్యం చుాడండి...
3.
"శివుడద్రిని శయనించుట
రవిచంద్రులు మింటనుంట రాజీవాక్షుం
డవిరళముగ శేషునిపై
బవళించుట నల్లి బాధ పడలేక సుమీ!"
నల్లి బాధ పడలేకనే శివుడు కొండలపై, రవిచంద్రులు ఆకాశాన, విష్ణువు ఆదిశేషునిపై పడుకున్నారని భావం.
శివుడు బండలమీద , విష్ణువు పాము మీద వాసముంటున్నారన్న వ్యంగ్యంగా
పద్య వర్ణనలో దాగి ఉన్న వెటకారం...అబ్బో....
అలాగే అరవ దేశానికి వెళ్ళినపుడు
అచటి ఆడవారిని గుార్చి అతని మదిలో మెదలిన భావాన్ని నిర్భయంగా వివరించి చెప్పిన పద్యం ..
4.
మేత గరిపిల్ల పోరున మేకపిల్ల
పారుబోతుతనంబున బందిపిల్ల
యెల్ల పనులను జెరుపంగ బిల్లిపిల్ల
యందమున గ్రోతిపిల్ల యీ యరవపిల్ల ॥
ఎంత నచ్చకపోతేమాత్రం...పరాయి దేశానికి పోయి అచటి స్త్రీ లను మనం ఇంతలా మనం వెక్కిరించి చెప్పగలమా...
ఈ పద్యం చుాడండి.
5 వ పద్యం .
"గిట గిట నగు నెన్నడుములు
పుట పుట నగు గన్నుగవలు పున్నమి నెలతో
జిట పొట లాడెడు మొగములు
కటి తటముల కొమరు శబరకాంతల కమరున్ "
జాతి ,మత, కుల వివక్షతలు లేకుండా కేవలం అందాన్ని మాత్రమే ఆస్వాదించే ఆనంద దృష్టి కోణమిది...
ఈ కాలంలో ఇలా ఆడవారిని గురించి వర్ణిస్తే
అమ్మొా...చెప్పు దెబ్బలే గతి.
అప్పటిలో గ్రంధ రచనలో లబ్ధప్రతిష్టుడైన శ్రీనాధుడు రాసిన ప్రతీ కావ్యముా కుాడా కవుల హృదయాలను దోచినదే.
ఈ రకంగా ఎన్నో చమత్కారాలతో నిండియున్న ఈతని
రచించిన చాటు పద్యాలు జనరంజకములై ప్రసిద్ధి గాంచేయి. అటువంటి శ్రీనాధుని రచనలగురించి ఎంతచెప్పినా తక్కువేకదుా..
బాల్యములోనే మరుత్తరాట్చరిత్ర అనే
బృహత్కావ్యాన్ని రచించిన ప్రౌఢ కవి శ్రీనాథుడు.
శ్రీనాథుడు తన గ్రంథాలతో ఎంతగా లబ్ధప్రతిష్టుడయాడో చాటువుల ద్వారా కూడ అంతే
ప్రసిద్ధిగాంచినవాడు.
కొండవీటి ప్రభువు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానకవి యైన శ్రీనాధుడు.
డిండిమభట్టు అనే పండితుని వాగ్యుధ్ధంలో ఓడించి అతని కంచుఢక్కను పగుల గొట్టించాడు. ఈతనికి కవిసార్వభౌముడను బిరుదము ఉంది.
కవులు తమ కావ్యాలలో ఇతివృత్తానికీ, కవితా పారమ్యానికీ ప్రాముఖ్యమిచ్చారు తప్ప వైయక్తిక అనుభూతులకు ఎక్కడోగాని తావీయలేదు.
శ్రీనాధుడు మాత్రం తనలో కలిగిన భావాన్ని వ్యక్తీకరించేందుకు వెనుకంజ వేయలేదు సరికదా,
అతడు ఆ భావాన్ని ఎవరికి వారు తమకే అన్వయించుకొనే విధంగా అందంగా పద్య
పాదాలను పొందుపరచేవాడు.
పొగడ్త , హాస్య , వ్యంగ్య ,అపహాస్యార్ధములు మేళవించి కవితలల్లి ఎందరిచేతో సన్నానాది గౌరవాలనందుకున్న చతురుడు.
ఒక అక్షరమొా పదమొా విడగొట్టి చదివితే వేరు వేరు భావాలను ప్రస్ఫుటించ గల ఈయన పద్య సుమాలు
చాటు పద్యాలుగా కీర్తికెక్కాయి.
తెలుగు సాహిత్యానికే వన్నె తెచ్చిన అతని చాటు పద్యాలు ఎంతగానో ప్రాశస్త్యం పొందేయనడంలో సందేహం లేదు.
వాటిలో వాటిలో కొన్ని మచ్చుతునకలు..
నాకు నచ్చిన కొన్ని చాటుపద్యాలు..
"సిరిగలవానికిజెల్లును
తరుణులు పదియారువేలుతగపెండ్లాడన్
తిరిపెమునకిద్దరాండ్రా
పరమేశాగంగవిడువు పార్వతిచాలున్॥"
పల్నాటి సీమలో నీరు లేక పంటలు పండక క్షామం
వచ్చి అల్లలాడుతున్న ప్రజలను చుాచి తట్టుకోలేని శ్రీనాధుడు ఆ పరమేశ్వరుని "గంగమ్మ" ను విడవయ్యా అంటుా చెప్పిన చమత్కార పద్యం...
అర్ధింపుతో పాటు నిందనుకుాడా జోడించి
భిక్షుకుడవైన నీకు ఈ కరువులో ఇద్దరు భార్యలెందుకయా? గంగమ్మను విడిచిబెట్టంటుా చెప్పిన పద్యం..
ఆ శివునకు కుాడా పద్యంలోని వ్యంగ్యం అర్ధం కాదేమొా ఆనిపించేంత అందంగా ఉందికదుా..
2వ పద్యం
"రసికుడు పోవడు పల్నా
డెసగంగా రంభ యైన నేకులె వడుకున్
వసుధేశుడైన దున్నును
కుసుమాస్త్రుండైన జొన్న కూడే కుడుచున్ "
ఈ కరువునిండిన పల్నాడులో రసికతకు చోటెక్కడ.
రంభయైనా నేకులే వడకాలి , మన్మధుడైనా జొన్నకుాడే తినాలంటుా.. పలనాటి కరువు దినాలకు పరితపిస్తుా శ్రీనాధుడు చెప్పిన పద్యం..అందరికీ కంటనీరు పెట్టించక తప్పదు.
ఓనాడు శ్రీనాధుడు సర్వజ్ఞ భుాపాలుని దర్శనార్ధం వెళ్లేడు. కొండవీటి ప్రభువు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానకవి యైన శ్రీనాధుడు.
పెదకోమటి వేమారెడ్డికినీ , సర్వజ్ఞ భుాపాలునికినీ మధ్య నున్న వైరం తెలిసిన శ్రీనాధుడు .
సర్వజ్ఞ భుాపాలుని ఆస్థనంలో
" శివునికి , మీకుా తప్ప సర్వజ్ఞ భుాపాలుడను నామం మరెవరికుంది. " అని పొగడి ప్రశంసాది సత్కారాలందుకున్నాడు లందుకున్నాడు .
అతడు చదివిన పద్యమిది..
సర్వజ్ఞ నామధేయము
శర్వునకే రావు సింగ జనపాలునకే
యుర్విం జెల్లును దక్కొరు
సర్వజ్ఞుండనుట కుక్క సామజ మనుటే ॥
శ్రీనాధుడు...పెదకోమటి వేమారెడ్డి దగ్గరకు వచ్చి అదే పద్యంలో రెండవ పాదం లో
జనపాలున .."..కేయుర్విన్ జెల్లును.".అని చదివి వినిపించి , మీకు విరోధియైన ఆతనిని ఈ విధంగా తిట్టి వచ్చేనని చెప్పి, ఆతనిచే సన్మానాలందుకున్నాడు
ఈ విధమైన చమత్కారం "సమయొాచితంగా మరెవరికైనా వస్తుందా" అనిపించేంతగా ఆశ్ఛర్యం కలిగించే విధంగా ఉంది కదుా.
3.
శివుడద్రిని శయనించుట
రవిచంద్రులు మింటనుంట రాజీవాక్షుం
డవిరళముగ శేషునిపై
బవళించుట నల్లి బాధ పడలేక సుమీ!
నల్లి బాధ పడలేకనే శివుడు కొండలపై, రవిచంద్రులు ఆకాశాన, విష్ణువు ఆదిశేషునిపై పడుకున్నారని భావం.
అద్భుత వర్ణనలో దాగి ఉన్న వెటకారం...అబ్బో....
అలాగే అరవ దేశానికి వెళ్ళినపుడు
అచటి ఆడవారిని గుార్చి అతని మదిలో మెదలిన భావాన్ని నిర్భయంగా వివరించి చెప్పిన పద్యం ..
4.
మేత గరిపిల్ల పోరున మేకపిల్ల
పారుబోతుతనంబున బందిపిల్ల
యెల్ల పనులను జెరుపంగ బిల్లిపిల్ల
యందమున గ్రోతిపిల్ల యీ యరవపిల్ల ॥
ఎంత నచ్చకపోతేమాత్రం...ఇంతలా మనం వెక్కిరించి చెప్పగలమా...
ఈ పద్యం చుాడండి.
5 వ పద్యం .
"గిట గిట నగు నెన్నడుములు
పుట పుట నగు గన్నుగవలు పున్నమి నెలతో
జిట పొట లాడెడు మొగములు
కటి తటముల కొమరు శబరకాంతల కమరున్ "
జాతి ,మత, కుల వివక్షతలు లేకుండా కేవలం అందాన్ని మాత్రమే ఆస్వాదించే ఆనంద దృష్టి కోణమిది...
ఈ కాలంలో ఇలా ఆడవారిని గురించి వర్ణిస్తే
అమ్మొా...చెప్పు దెబ్బలే గతి.
అప్పటిలో గ్రంధ రచనలో లబ్ధప్రతిష్టుడైన శ్రీనాధుడు రాసిన ప్రతీ కావ్యముా కుాడా కవుల హృదయాలను దోచినదే.
ఈ రకంగా ఎన్నో చమత్కారాలతో నిండియున్న ఈతని
రచించిన చాటు పద్యాలు జనరంజకములై ప్రసిద్ధి గాంచేయి. అటువంటి శ్రీనాధుని రచనలగురించి ఎంతచెప్పినా తక్కువేకదుా..
No comments:
Post a Comment