Wednesday, December 8, 2021

గాయత్రీదేవిగారు రాసిన ఉత్పలమాల పద్యాలు

మహతీసాహితీకవిసంగమం
కరీంనగర్
అంశం:ఐచ్ఛికం
తేదీ:8.12.21

మ.సా.క.సం:5

పేరు:డా.గాయత్రీదేవి
ఊరు:విశాఖపట్నం
క.సం:2
ప్రక్రియ:ఉత్పలమాలిక.
శీర్షిక;భారతమాతకు గజమాల.


శ్రీరమణీయమున్ సహజసిద్ధమనోహరభాగ్యదమ్ములున్

సారవిభాప్రభాసమునుసజ్జనచిత్తమువోలెశోభిలున్

హారముగాగనిల్చినవహా!విరళీకృతశైలసంపదల్
భారతధాత్రికియ్యవియు ,భద్రతగూర్చును సైనికాళులీ

ధారుణిధాతసృష్టి ,కడుధన్యముదివ్యపవిత్రధర్మమై
భారతభూమిరక్షణయెభాగ్యముగాతలదాల్చినట్లు ,దీ
క్షారతియుత్తరానహిమశైలమునిల్చెమహోన్నతమ్ముగా
భారతసైనికాళికిల ,బంగరుమార్గముజూపునట్లుగా

తూరుపుతెల్లవారగను తోరపుకాంతులభానుమూర్తికిన్
సారపుజన్మభూమిగను ,జక్కగభాసిలు ,నస్తమించ ,నా
దూరపుకొండలే ,మహిత దూరపుబంధువువోలెదోచు ,చె
ల్వారగశైలసంపదలుభారతదేశపు భాగ్యరాశులై

సారమతింగవీంద్రుడు ప్రసన్నకథాకలితార్థయుక్తితో
భారతభారతీపదముబంగరుపువ్వులపూజసేసి ,తా
భారతగాథలోమహితపావనధర్మముసూక్తిసారముం
దీరుగనిల్పినట్టి ,మహనీయుని నన్నయకంజలింతు ,నా

శ్రీరమణీయకావ్యములశ్రీహరిశంకరుతత్త్వమొక్కటే
వారికృపావిలాసమిది,భావనజేయగవిశ్వమంత ,వి
స్తారతశోభనిచ్చె కవితాసుధభూషగదాల్చెనాంధ్రమున్
గారవమొప్పమ్రొక్కిడుదు,కైతలబమ్మకుతిక్కయజ్వకున్.

భారతపర్వశేషమునుభాసురలీలరచించి.,వర్ణనా
సారమరందధారలను ,జల్లుచుతెన్గుప్రబంధమూర్తియై
క్షీరమరందమాధురుల శ్రీకరిశారదపాదసన్నిధిన్
జేరినశంభుదాసునికి ,చేతమురంజిలనంజలించుచున్


ధీరుడుసంస్కృతాంధ్రములరసతేజమునందిన ,దివ్యమూర్తి ,సం
స్కారపయోధిలోమునిగి ,కమ్మనిరామకథారసమ్ములన్
చారుమనోజ్ఞమోహనము ,సందడిజేసిన వేయిపడ్గలున్
హారముగానువైచి ,భువిహ్లాదముగూర్చెనువిశ్వనాథుడా


శ్రీరమణీయకావ్యముల ,శేముషిసింధువు ,సంస్కృతమ్ములో
ధీరశకుంతలాగధను ,ధీరునియక్షునిమేఘదౌత్యమున్

హారముగాసరస్వతికి ,హ్లాదమొనర్చినకాళిదాసు ,ఓం
కారమునట్లుభాసిలెను ,కమ్రశుభోపమవాణిదాసుడా 

చారుశరీరు ,పాపహరు ,సాధుగుణాకరు ,రామభద్రునిన్
తారక మంత్రసాధనను ,తన్మయతన్ ,గనివల్మికీయుడున్
కూరిమినాదికావ్యముగ ,క్రొత్తదనమ్మునగూర్చినిల్పె ,నా
తారకరామభక్తు ,మది,దద్దయుగొల్తు ,ప్రచేతసాత్మజున్

సారపదప్రవాహఝరి ,సత్కవితావిధిశారదాంబనే
చారుతరమ్ముగాగొలిచె ,సత్కృతిగాకనకాభిషేకముల్
ధారుణిపొందినట్టి,కవితారససారధి ,రెడ్డిరాజ్యపున్
వారధి ,సార్వభౌమకవి ,ఫాలవిలోచనభక్తవర్యుడై.

కోరడుభూమిభాగములు ,గోరడు భాగ్యపురాశులెయ్యడన్
తారకరామమంత్రమహితాబ్ధిని ,దేలుచు ,పోతనార్యుడున్
కోరికతీర ,కృష్ణురసఘూర్ణిత వృత్తము గోపికాసుధల్
జారగవ్రాసెభాగవత ,సత్కృతి ,తెన్గునశబ్దశయ్యగా..

భారముడించమానవులపాపమణంగగ ధర్మమార్గ ,సా
కారుడు,బాదరాయణుడు క్ష్మాస్థలిజేసెపురాణరాశులన్
భారతగాథలన్ ,మహితభాగవతమ్మును ,ముక్తిమార్గప్రా
కార ,పరోపకారమతి ,కారణజన్ముడు విష్ణురూపుడా

వీరుడుకోవిదాళి ,మునువిద్యలవేల్పుగపండితాళి ,వి
స్తారయశోవిభూషిత ,ప్రసన్నమతుల్ యనకృష్ణరాయలా
పూరగళమ్మునెత్తి కవిపుంగవశ్రేణినిగారవించి ,స
త్కారమొనర్చెసంతతము ,కావ్యరసమ్ములనోలలాడి సం.

పూరకపద్దెవిద్దియల ,భూషగదాల్చగ కృష్ణరాయలే
తీరుగపల్లకీవహనదీక్షనుబూనుచుగారవించుచున్
జేరికగండపెండెరము.,చిత్తముపొంగగనీకునిచ్చె ,నో
సారమతీ!కవీనతులు ,సత్కవిపెద్దనజ్ఞానశోభితా!
.
తారసపుష్టితోప్రతిపదమ్మునయాంధ్రపుజాతినానుడుల్
సారెకుసారెకుంగలుగ ,సజ్జనచిత్తమురంజిలం జమ
త్కారముదోపగకవితగారవమందగచేమకూరయున్
వారకవ్రాసెకావ్యమును ,పార్ధునిదివ్యవిలాసగాధలన్.
ఈరసరమ్యవిశ్వముననేప్రభుగాధలుదివ్యబోధలై
వారకపారిజాతమును భామకుతెచ్చెనుకృష్ణమూర్తి ,తత్
భారతరమ్యగాధలవి బాయకభక్తితెనుంగుకిచ్చి ,బృందారకవంద్యుగొల్చుమహితాత్మునితిమ్మనకంజలించగా 


గారవమైనజీవికను ,కష్టసుఖమ్ములు రాజభోగముల్
దారుణమంచునెంచిభవతారణమందగశంభుభక్తుడై
తోరణకట్టువోలెకవితోత్పలమాలలనర్చసేసె ,నా
మూరితిధూర్జటీమహిత ,మోక్షపుగామిగభూతలమ్ములో 
.
భా‌తరామగాధలను ,పావనరీతినిద్వ్యర్ధికావ్యమై
తీరిచికల్పనాజగతితేజముమీరగపూర్ణభావసం
చారి ,కళావతీకథను ,సన్మతిపింగళిసూరనార్యుడే
సారమెరింగెఠీవికను ,సత్కవిరాయలకాలమందు,నా

దారినిసాహితీజగతితద్ధిమినాదవిలోలలోలతా
ధారమురామరాజు ,భువిధన్యతతావసురాజగాధనే
పారములేనిదీక్షయు ,నపారతపంబుగతెన్గుభాష ,తా
నారసికమ్రరీతికడునద్భుతలీలరచించెమూర్తియున్

శారదసత్కృపామహితసారమనస్కుడురామకృష్ణ ,యా
సారముపాండురంగవిభుసన్నుతిసేయుచు ,పాదుకొల్పెనీ
ధారుణిసోదరీమహిమ ,తాల్మివచించెయశస్కరుండునై
సారెకుసారెకుం సరససాహితిచిప్పిలయాంధ్రనాట ,నా
  
ధారమువాజ్ఞ్మయమ్ముసమతా ,సుధపొంగగబాలబాలికల్
సారవివేకమందగనుసద్బుధవంద్యుడు చిన్నసూరి.,వి
స్ఫారత సూత్రభాష్యముగ బాలలకైనొకగ్రంథరాజమున్
కోరినశబ్దశుద్ధినిడు ,కోర్కెలతీర్చెడుకల్పవృక్షమై .

వారలువీరలున్ జనులు వాడెడిభాషకు పట్టుబట్టి ,తా
ధీరతనుద్యమించె ,భువితెల్గువెలుంగుకు ,దీక్షబూనినా
రా ,రమణీయపుం బథమురంజిలగూర్చెనురామమూర్తి ,లో
నారటమందియాంధ్రులకు నచ్చతెలుంగునుధారపోసె నా,

శూరునిబాటలోనడచి ,శుద్ధతముత్యపుమాలల్లి ,తా
భారతికంఠహారముగ ,భద్రతపూర్ణమ ,కన్యకాది ,వి
ద్యారమణీయతత్త్వములనర్చనసేసెను ,దిద్దుబాటుతో
కారణజన్ముడయ్యె ,కార్యధురంధరుడప్పరాయుడా 
పేరదిపాపరాయలట ,పెన్నిధికంకటివంశజాతుడే
సారతరామగాధమహి ,సన్నుతిలందుచునుత్తరార్ధమున్
తీరగువైభవాత్మకము ,తేటతెలుంగులవాక్యలాస్యమే
పారగ శాశ్వతమ్ముగను ,పావనరీతిరచించినాడు ,తత్.

పారవశమ్ముతోపలికె ,పావనిరామునిభక్తురాలు ,స
త్కారవిదూర!సాధుమతి ,కమ్మనితెల్గున తేనెవాకగా
నారదసన్నుతాదిమునినాథసుపూజితరామగాధ ,నా
భారతిదీవనమ్ములను ,పట్టుగమొల్లయు ,కీర్తిగాంచ ,సత్ 24

హారముశైవనాదముగ హారతులిచ్చిననన్నెచోడుడున్
సారతరమ్ముగా‌బసవసారమునిచ్చెనుసోమనాథ ,ధీ
సారము ,లీభువిన్ ,మహిత ,శైవపుతత్త్వముగావెల్గె ,సుధా
పూరితమాంధ్రభాషగడు ,పుణ్యధనంబయె ,జానుతెన్గుగా

ధీరులవాక్యకోవిదుల ,ధీధితినిండి సినారెపద్యముల్
హారములయ్యెభారతికి ,హ్లాదమొసంగు ,గజళ్ళసందడిన్
తోరపుగీతరాగముల.,తతోషణచెందిన భారతి కాలియందియల్
శారదరాత్రులందునవ ,శాద్వలవీధుల.,మంజునాదముల్.


తేరిదివేలవర్షముల ,తెల్గువెలుంగులు ,పద్యగద్య ,ప్రా
కారమువోలెభాసిలును కావ్యజగమ్మదిమోహనమ్ముగా
భారతభారతీపరమపావనిపాదమిళిందులై ,కవుల్
ధారుణి నవ్యభావముల ,స్థానముగాకవనమ్ముచెప్పెడిన్.


స్వీయరచన
,

No comments:

Post a Comment