రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
ప్రక్రియ : గేయ కవిత.
----------------------------
రామా ! నిను తలచినంత నేమా వెతలన్ని
తీరునోమారిటు రార ! రామ రవికుల సోమా !॥
బాలా కౌశల్య వర కృపాళా ! శ్రిత పరిపాలా !
లీలా కరుణాలవాల , మృదు పద జాలా..॥
కామారి వినుత రామ, ఇనవంశ కుల సోమ
ధామా ! అయొాధ్య రామ, ముని జన కామా ॥
నందా.... ! దశరధానందా ! సీతా-మనార-
విందా ! మృదు మధుర హసిత భుాష తరంగా !॥
అంగా ! కరుణాంతరంగ..రామా ! ముని
హృదయ భృంగ ! రాజాధి రాజ రామ !
ధను ధర భీమా ॥భంగా! గర్వారి, దైత్య
దమనా,ధర పాలిత వర! సుగుణాభి రామ -
రామమేయ శుభాంగా ॥
ఆజ్ఞ కారి, వన విహారి ,యజ్ఞ రక్షకాధారీ
కల్యాణ గుణ కారీ ! భవ సాగర తారీ॥
అహల్యాది శాప హారి। తాటకాంతకా సౌరీ !
లోకాది వందిత పద ! పాప నాసకారీ ॥ ॥
పట్టాభి రామ రామ ! సృష్ట్యాద్యవతార భీమ!
సుందర సుకుమార సోమ ! మంగళ శుభ కామా ॥
రామా ! శ్రీ రామ రామ ! సీతా ! మనోభి రామ ।
వాతాత్మజ వందిత పద ,నౌమీ .। శ్రీ రామా ॥
--------------------------------------------------------
--------------------------------------------------------
హామీ:
హామీ: నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితం కాని నా స్వీయ రచన.
--------------------------------------------------------
15/04/2021.
తెలుగు భారతి సాహిత్య సేవా సంస్థ -ఎస్ వీ ఫౌండేషన్, ప్రజా సేవలో ----
జనదీపిక సంయుక్తంగా నిర్వహిస్తున్న కవితా వసంతోత్సవం ,
*శ్రీరామ నవమి కవితా వసంతోత్సవం*
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
శీర్షిక : అవతార పురుషుడు.
ప్రక్రియ : గేయ ప్రక్రియ.
క్రమ సంఖ్య : 127.
దశరధానంద నేత్ర ! కౌశల్యా వరపుత్ర!
భరత లక్ష్మణాది భ్రాత ! రవి కుల జాత॥
కైకేయిా వర పాలిత ! పితృ వాక్య పరిపాలక ,
కానన వనవాస రామ ! ఖలుసాంతక భీమా ॥
శివ ధనుా భంగ రామ ! సీతా మనోభిరామ!
త్రేతాయుగ పరంధామ! పావన ఘన శ్యామా ॥
మాయా మారీచ దమన ! మంగళ శుభ కామనా.. రాక్షసాంతకా ఘనా ! సీతా హృదయ భావన ॥
లంకా ధహనావేశ ...జానకీ , శోక నాశ !
వాతాత్మజ వందిత పద ! మంగళ కర,చరణా ॥
దశకంఠ...దైత్య దుార। ధర్మ పాల ధను ధీర
మర్యాద పురుషోత్తమ ! మంగళ శుభ చరితా ॥
రాజాధి రాజ రామ ! ముని మానస హృదయ కామ॥
ధామా ! అయొాధ్య పాల ! రఘు కుల సోమా ॥
ధర పాలిత దివ్య నేత్ర ! రామా వర సుగుణ గాత్ర
కరుణా తరంగ నేత్ర । కామారి మిత్ర ॥
పట్టాభి రామ రామ పావన సీతాభి రామ
పరమాత్మా సుచరిత శుభ సుందర రామా।
దేవాది ముని వందిత నుత పథ, పద గీర్వాణ
జన గణ హిత కల్యాణ ! మంగళ శుభ నామా ॥
--------------------------------------------------------
శీర్షిక : లోక కల్యాణ కారకుడు.
వచన కవిత.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
--------------------------
దుష్ట శిక్షణ , శిష్ట రక్షణ కోసం
శ్రీమహా విష్ణువు ఎత్తిన దశవతారాల లో
ఏడవ అవతారం శ్రీరామచంద్రుడు ॥
రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే మనం శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటాం.
లోక కల్యాణార్ధం మానవ అవతారం ఎత్తిన
శ్రీ రామచంద్రుడు , తలిదండృలను ఎలా
గౌరవించాలో , వారి మాటకు ఎంత విలువ
ఇవ్వాలో తెలియపరచేడు.
బాధ్యత గల రాచ బిడ్డగా ధర్మ బద్ధమైన
ప్రజా పాలనఎలా చేయాలో ఆచరించి చుాపేడు.
ఒకే మాట ,ఒకే భార్య అంటుా వైవాహిక
బంధపు విలువలని చాటి చెప్పేడు.
అన్నదమ్ముల ఆదర్శానికి , ఆలు మగల అనుబంధానికి, ధర్మ పరిపాలనకు ,
దుష్ట -శిక్షణ కు,శిష్ట -రక్షణకు , పేరుగా
శ్రీ రాముని చరితం తార్కాణ మంటారు.
జగద్విఖ్యాతి గాంచిన "శ్రీరామ నామ జపం"
సర్వ దేవ ,ఋషి ,ముని మానవులందరికీ ముక్తి,మొాక్ష కారకమని , కలియుగంలో
రమ నామ జపమొక్కటి చాలు , జన్మ తరింపజేయడానికని , వేద శాస్త్ర పురాణ
విదితమైనది. సాక్షాత్తుా మహాదేవుడు కుాడా
నిత్యం జపించే శ్రీరామ నామాన్ని మనముా
జపించి కృతార్ధుల మౌదాం.
----------------------------------------------
No comments:
Post a Comment