రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర
పద్యము : మత్త కోకిల
అంశం : దత్తపది:
* జంగము- అంగము- లింగము- సంగము.
(జంగ )మేశసు భస్మ భుాషణ
జన్మ మారణ కారకా
(అంగ )మార్ధగ నంబ నేలిన
ఆది భిక్షుడ వీవయా
(లింగ )కారుడ శృంగ శైలసు
శీల పార్వతి నాధుడా
(సంగ)మేశ్వర గంగ ధారుడ
సాధు సన్నుత కావరా ॥
(లింగ) రుాపసు భక్త పోషక
లీల కార్య విశేషకా ॥
(జంగ)మార్చిత భస్మ భుాషణ
జ్ఞాన ధారత్రి నేత్రకా॥
(అంగ) రంగసు వైభవార్చిత--
(ర్ధాంగ)పార్వతి నాయకా॥
కాశికాపుర వాస (సంగ)మ
కార్య ముక్తి ప్రదాయకా ॥
(జంగ)మేశ్వర భిక్షు డైతివే
జగము లేలిన (లింగ)మా ॥
గంగ నెత్తిన దాల్చినా శివ
గావు శక్తిసు లింగమా ॥
(అంగ) మార్ధగ నంబ కిచ్చిన
శృంగ తేజసు లింగమా ॥
గంగ ముాడగు (సంగమం)బున
మొాఘ మొాక్షపు లింగమా॥
No comments:
Post a Comment