31/10/2020
రచన శ్రీమతి
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ మహారాష్ట్ర
8097622021
ప్రక్రియ సమ్మొాహనాలు
శీర్షిక .
కాదేదీ కవితకనర్హము.
-----------------------------
81
ముద్దు మాటల పలుకు
పలుకు తేనెల నొలుకు
ఒలుకు ముద్దులు చిలుకు పలుకులవి ఈశ్వరీ॥
82
ఆట పాటల వయసు
వయసు తెలియని మనసు
మనసు తెల్లని దినుసు మసలుటలు ఈశ్వరీ ॥
83
మనసులోని భావము
భావము అనురాగము
రాగము శృంగారము వర్ణనలు ఈశ్వరీ ॥
84
అందాల వర్ణనలు
వర్ణనల చుాపులుా
చుపులే ప్రేమలేఖలు కదా ఈశ్వరీ॥
85
కవిత లల్లగ మనసు
మనసులో పలిదినుసు
దినుసు ని దౌమనసు బాసలే ఈశ్వరీ ॥
86
ప్రేమలో ప్రకృతదె
ప్రకృతి లో ఆకృతిదె
ఆకృతికి అందమౌ వర్ణనిదె ఈశ్వరీ ॥
87
పెరిగు వయసు చిత్తము
చిత్తము గాంభీర్యము
గాంభీర్యము వేదాంతము గనుము ఈశ్వరీ ॥
88
పెద్దరికపు మాటలు
మాటల లో సుాక్తులు
సుాక్తుల నిడు కవితలుా కధలుా ఈశ్వరీ ॥
89
వృద్ధాప్య వేదాంత
వేదాంత స్వాంతత
స్వాంతన ప్రసాంతతల కవితలుా ఈశ్వరీ ॥
90
చింతన ల భేదములు
భేదముల రాగములు
రాగాలనురాగపు కవితలుా ఈశ్వరీ ॥
91
వయసుకో ముచ్చటా
మచ్చటల కవితటా
కవితల లొ భేదమౌ భావమట ఈశ్వరీ ॥
92
కాదేదీ కవితకు ను
కవితకు అనర్హమును
అనర్హమను మాటలు వదలిమను ఈశ్వరీ ॥
No comments:
Post a Comment