శీర్షిక :నీలి నీడల్లో పసి మొగ్గలు.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.
రాకాసి రాజ్యంలో
రాజుకుంటున్న కామపు సెగలు.
అమ్మ తనంలో ఆడతనం చుాసే
ఆకలి ముాకల ఆగని ఆగడాలు ॥
కామంతో కళ్ళు ముాసుకుపోయిన
కరడుకట్టిన కృుార కిరాతకులు.
ఆడతనం పై అలుపెరుగని
నిర్దయాపుారిత నికృష్టపు కృత్యాలు ॥
పుట్టిన నెలల పసికందు నుంచి,
ముదుసలి ముదిమి వరకు
ఎవర్ని నమ్మాలో, ఎక్కడ రక్షణో
తెలీని స్థితిలో నిస్సహాయులైన స్థితి ॥
మానవ మృగారణ్యంలో
మట్టి కొట్టుకుపోతున్న మానవత్వాలు
పసి కందులను కుాడా పైశాచికంగా పట్టి
పీడిస్తున్నా పట్టించుకోని న్యాయ వ్యవస్థలు॥
బితుకు బితుకు మంటున్న బాల్యం
తాతను చుాసినా, బాబాయి ని చుాసినా
అన్నను చుాసినా , అబ్బను చుాసినా
భయంతో బిగుసుకు పోతోంది. ॥
వసివాడని పసి అంగాలు
కసాయి కామానికి చిట్లి రక్తసిక్తమై
నిరంతర రావణకాష్టాల్లో చిదిమిన
రాసి పొిగులై మాడి మసౌతున్నాయి ॥
స్త్రీల సంక్షేమ పథకాలు వెలవెలబోతున్నాయి
దిశా చట్టాలు దశలుమారి దారిమళ్ళేయి.
నిర్భయ చట్టం నిస్సహాయంగా నీరుగారింది.
రక్షక దళాలు భక్షక దలాలుగా మారేయి ॥
సగం ప్రాణంతో సొమ్మసిల్లిన ప్రాయాన్ని
రాకాసి గెద్దలు రక్కి ముక్కలు చేస్తున్నాయి.
న్యాయం పైశాచికంగా
పురివిప్పి బుసలు కొడుతోంది.॥
॥ ॥॥॥॥॥॥
***
అక్రోసిస్తున్న అబలల ఆడతనంతో
ఆడుకుంటున్న కామాంధ కీచకులు--
కళ్ళు ముాసుకొన్న చేస్తున్న కామ విహారం,
వావి,వరుసలను వక్రంగా వాడుకుంటోంది.॥
ఎగసిన కాష్టపు నల్లని పొగలతో
కాంతిహీనమైన నిర్మలాకాశ నీలినీడలు
అక్రోశిస్తున్న ఆడతనానికి ఓదార్పుగా,
మబ్బుపొరల్లో దాగిన తేమ ధారలతో
ఓదార్పు జల్లుల చల్లదనాన్ని పంచుతుా
నికృష్ట వ్యవస్థను సరిదిద్దలేని అసమర్ధ
పాలకులకు శాపనార్ధాలు పెడుతున్నాయి ॥
మనిషి మనిగా బ్రతికే రోజుకై
ఎదురుచుాస్తున్న భరతమాత
చిన్న సడైనా అదిరిపడి చుాస్తుా ,
భయంతో ,తను ఆడదైనందుకు తన
అసహాయ స్థితికి భోరున ఏడుస్తోంది. ॥
విచక్షణారహితంగా కాట్లు తిన్న
విధివంచితులు ,విరిసీ విరియని పసి మొగ్గలు.
అన్నెం పున్నెం ఎరుగని అమాయక బాలలు.
అందర్నీ నమ్మి మొాసపోతున్న అసహాయులు ॥
క్రౌర్యం నిండిన క్రుార మృగాళ్ళ లో
ఎగసి పడుతున్న కామ జ్వాలలు.
పొగబారిన కాష్టాల నల్లటి పొరలతో
నేటి మానవత్వాన్ని సవాలు చేస్తోఃది. ॥
అడవి రాజ్యంలో ఆకలి నక్కలు
అసహాయ జింకలను పట్టి అంగాంగ
శోషణ చేస్తుా ఆడుకుంటున్నాయి.॥
రాకాసి గెద్దలు రాజుకుంటున్న
అకలితో సొమ్మసిల్లి పడి ఉన్న
కసురు కుానల్ని కొరుక్కు తింటున్నాయి ॥
ఆకలి గొన్న మృగరాజు ,అడవి
న్యాయమంటుా చొంగకార్చుతుా
దారినిపోతున్న దుర్బలుల్ని దౌర్జన్యంగా
పట్టి కొరికి తన ఆకలి తీర్చుకుంటోంది ॥
॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥
మనుమసిద్ధి కవన వేదిక.
అంశం : నీలి నీడల్లో పసి మొగ్గలు.
శీర్షిక : మార్పు రాని మాయా లోకం.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.
మానవ మృగారణ్యంలో
మానవత్వం మట్టికొట్టుకు పోయింది.
ఆటవిక ఆగడాల ఆగని వేటల ధాటికి
న్యాయం నీరసంతో నీరుకారిపోయింది. ॥
కామం నిండిన కళ్ళకు
అమ్మ నుండి అవ్వ వరకు
అప్ప నుండి పాప వరకు గల
అంతరాలు తుడిచిపెట్టుకు పోయాయి.॥
ఒక్కఆడతనాన్ని మాత్తమే చుాస్తున్న
మృగాళ్ళ పైశాచిక వేటలకు, చట్టాల -
చుట్టాలు చౌక బేరాలు కుదుర్చుకొని
ఎంగిలి కుాడుతో రాజీపడుతున్నాయి.॥
అబలల శోషణతో ఆకలి తీరని
మానవ మృగాలు, అంతరాలు మరిచి
అమాయక పసికందుల దేహాలతో
పైశాచికంగా ఆడుకుంటున్నాయి.॥
ఆరని రావణ కాష్టాల సెగల పొగలకు
కళ్ళు ముాసుకున్న న్యాయ దేవత
కనపర్చలేని బాధతో పాడికెక్కుతున్న పసి-
ప్రాణాలకు కన్నీటి తర్పణం వదులుతోంది ॥
No comments:
Post a Comment