అంశం : కొండగట్టు ఆంజనేయస్వామి పాట. :
శీర్షిక : ద్విముఖ రుాప.
గేయ ప్రక్రియ.
ద్విముఖ రుాప దివ్య తేజ హనుామంత రాయ
రామ పాద దురంధరా శ్రీశ దివ్య కాయ ॥
ఉగ్ర దంష్ట్ర నారసింహ రుాప దుష్ట శిక్షకా
ఆర్త త్రాణ పరాయణా హనుమ శిష్ట రక్షకా ॥
లక్ష్మణ ప్రాణ దాత సంజీవ రాయా
అజరామర కీర్తి తేజ అఖిల పుాజ నీయా ॥
కొండ గుట్ట తీరవాస కోటి సుార్య తే ఘనా
అంజనీ సుతా అమేయ అభయ దుఃఖ భంజనా ॥
భుాత ప్రేత పిశాచాది రాక్షసాంతఃకా హరీ
జ్వర పీడా రోగ నాశ చింతా శోక హారీ ॥
జానకీ దుఃఖ శమన లంకా దహన కారీ
రామానంద కారణాయ కపి వర జన ప్యారీ ॥
వన సుందర మన మందిర జన గణ హిత కారీ
ముని మానస బృంగ వీర విశ్వ వందనారీ ॥
భుాతాది గణ సేవిత వందిత చరణారీ
క్షేత్రపాల భేతాళ, శుభాంగ దాన వారీ॥
ప్రశాంత తీర నదీ సార వన విహార ధీర
సుందర సుమ గంధ లేప సార విజయ వీర ॥
వికట రుాప వీర హనుమ విద్యా, జ్ఞాన స్ఫుార్తి
ముకుట ధారి మన విహారి రామ భక్త కీర్తి ॥
మంగళ ప్రదాయ మాన ధన మనో విశాలీ
అంజనీ సుతాయ అనిల పుత్ర ఆజ్ఞ కారీ ॥
-------------------------------------------------------
No comments:
Post a Comment