Friday, August 12, 2022

శ్రావణ మాసం విశిష్టత


అంశం: శ్రావణ శుక్రవారం
విశిష్టత.
శీర్షిక  : భక్తుల పాలిట కొంగు బంగారం.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .

మహావిష్ణువు జన్మ నక్షత్రం “ పేరుతో ఏర్పడిన "
 శ్రావణ "మాసం శ్రీమహా విష్ణువు పూజకు ఉత్కృష్టమైన మాసం..॥
శ్రావణ మసంలోని మంగళవారాలు 
శ్రీగౌరీ పూజకు,శుక్రవారాలు శ్రీలక్ష్మీ పూజకు, శనివారాలు శ్రీమహావిష్ణువు పూజకు ముఖ్యమైన దినాలు

స్త్రీల వ్రతాలకు నోములకు  ప్రసిద్ధి చెందినదీ  శ్రావణ మాసం.॥
శ్రీమహాలక్ష్మి  చారుమతి అనే పుణ్య స్త్రీ కి
స్వప్నంలో కనిపించి శ్రావణ మాస 
విశిష్టతను విశదీకరించిన విధమును 
ఈ నాటికీ స్త్రీ లందరుా పాటిస్తుా ఆ తల్లి
శ్రీలక్ష్మిని కొలిచే ఆచారం ఈ శ్రావణ మాసం కావడం గొప్ప విశేషం. ॥
పౌర్ణమికి ముందుగా వచ్చిన శుక్రవారము నాడు  స్త్రీ లంతా శోభాయమానంగా గృహాలను అలంకరించి ,  అమ్మవారిని కలశములోనికి ఆహ్వానించి ఆపై
రంగురంగుల పుాలు, పసుపు, కుంకుమలతో ,
అమ్మవారిని  పుాజించి పంచభక్ష్య పరమాన్నాలు నైవేద్య మిడి , భక్తి నిండు శ్రావ్య , మంగళ వాద్యాలతో మంగళ గీతాలు పాడి శ్రీలక్ష్మిని సౌభాగ్య సిరులీయమని స్త్రీలంతా వేడుకునే సంబరమిది. 

ఇది ఈ శ్రాణ శుక్రవారం యొక్క విశిష్టత.
ఈ కధను విన్నవారికి చదివినవారికి ఆ వరలక్ష్మీ 
కృపతో సకలసౌభాగ్యములు కలుగుతాయని స్త్రీ లు నమ్ముతారు.



No comments:

Post a Comment