Saturday, August 13, 2022

బాల భారతం...చాచా నెహ్రూ .

బాల భారతం .
అంశం : జవహర్‌లాల్ నెహ్రూ.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .


పిల్లల్లారా రారండీ 
పాపల్లారా వినరండీ
చాచా నెహ్రూ  కధ చెపుతాను 
కచక్కగ కుార్చొని వినరండీ ॥

భారత స్వాతంత్ర్య  నాయకుడితడే
 తొలి ప్రధానిగా పాలకుడితడే
 పండిత్ జీగా ఖ్యాతి గడించిన 
 జవహర్ చాచా నెహ్రూ ఇతడే ॥

రాజకీయాల బాట నడచిన 
గాంధీ తాతకు సఖుడితడుా
సత్యాగ్రహాలు చేసేడుా
జైలు శిక్షలను పొందేడు ॥

ఇందిరమ్మకు తండ్రితడుా
ప్రపంచ చరితలు తెలిపాడు
కాంగ్రెస్ సభలకు వెళ్ళేడు
సరియగు న్యాయం కోరేడు ॥

  లౌకిక మానవతావాదిగ , 
 సామాజిక ప్రజ స్వామ్యవాదిగ 
 శక్తివంతముగ భరతావనిని
 చేసిన ప్రసిద్ధ నాయకుడు ॥
 
ఆధునిక భారత దేశ వైభవం 
సాంకేతిక పరిజ్ఞాన ప్రాభవం 
చాచా నెహ్రూ మనసా వాచా 
చేసిన దేశమె మన దేశం ॥

భారత రత్నగ పురస్కారము
డాక్టరేట్ గా ఘన సత్కారము
పొందిన ఘనుడు చాచా నెహ్రూ 
అందరి కిష్టుడు చాచా నెహ్రూ ॥

గులాబీలను అలంకరణగా
బాలల పాపల ప్రేమించెనుగా
చాచా నెహ్రూ పుట్టినరోజు
బాలల కెంతో ప్రీతి గదా ॥

చాచా చుాపిన ఔదార్యం
దేశ ప్రజలకై సేవా గుణం
పసి పిల్లలపై మమకారం
చాచా కోరిన నవ భారతం ॥

------------------

No comments:

Post a Comment