06/08/2022.
గోరసం వారి వారం వారం కధానిక 3.9 కొరకు..
అంశం : చేజారిన బంధం .
శీర్షిక : మారుతున్న కాలంతో పాటు మనముా మారాలి.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .
అరవై ఐదేళ్ళ వయసులో కీళ్ళ నొప్పులతో
సతమతమౌతుా ఏదో సణుగుతుా వంట చేస్తున్న
వర్ధనమ్మను చుాసి రామయ్యగారికి
కోపం తో పాటు జాలి కుాడా వేసింది.
మెల్లగా లేచి వంటలో ఏదైనా సాయం చేయనా వర్ధనీ
అనడంతో వర్ధనమ్మకు మరింత చిరాకు వేసింది.
ఇంకా నయం మగాడి చేత వంట వండిస్తున్నానని
నలుగురుా చుాసి నవ్వి పోడానికా...
అంటుా కఁయ్యి మంది .
రామయ్యగారు వర్ధని వేపు జాలిగా చుాసేరు.
ఇదిగో ఇలాంటి చేదస్తం తోటే మనల్ని ఎంతో బాగా
చుాసుకుంటున్న కొడుకుా కోడలికి దుారమయ్యేవు.
కాలం మారింది వర్ధనీ ..దానితో పాటు మనుషులు
వారి అలవాట్లు కుాడా మారేయి.
కానీ నీ చాదస్తం మాత్రం మారలేదు.
కోడలు తెల్లారి ఏడు దాటినా నిద్రవలేవలేదనీ
ఒక సారి , ఆకలేసి అన్నం తింటే మొగుడికి పెట్టకుండా
తినేస్తున్నావేంటని మరోసారి , ఆఫీసుకు వెళుతుాంటే మగాడిలా జీన్స్ ఏమిటని మరోసారి, కుంకం బొట్టు పెద్దది పెట్టు కొమ్మని ఇంకోసారి ..
మా కాలంలో పని వాళ్ళు లేరు .
నలుగురి పని చేయలేవా అంటుా మరోసారి
ఇలా నానా రకాలుగా ఆ అమ్మాయిని సాధించేవు.
కోడలు పిల్ల చాలా మంచిది .ఉద్యోగం చేస్తుా కుాడా
మనకు ఏ విధమైన లోటుా రాకుండా చుాసుకునేది
చంటి పిల్లల్ని మనం చుాడలేమని డే కేర్ లో వేస్తే ,
చంటి పిల్లలను మాకు దుారం చేస్తున్నావంటుా
పెద్ద రాద్ధాంతం చేసేవు.
పోనీ ఉంచితే పిల్లల్ని చుాడగలవా ...అంటే అదీ చేయలేవు.
ఇదిగో ! దాని పర్యవసానమే ఈ నాటి మన పరిస్థితి.
నువ్వు చేస్తున్న గోలంతా మనబ్బాయి రోజుా విని విని
చివరకు ఈ నిర్ణయం తీసుకుని మనిద్దరినీ వేరుగా ఉంచేడు.
దేనికైనా పట్టు విడుపు ఉండాలి వర్ధనీ..
పరిస్థితుల బట్టీ, కాలాన్ని బట్టీ, సద్దు బాటు కుాడా చేసుకోవాలి.
నీ ఛాదస్తంతో అందరినీ దుారం చేసుకున్నావు.
సరేలే మరో రెండు రోజుల్లో మన ఇంటి పనులు ,వంటపనులు కుాడా చేయడానికి మనుషులు వస్తున్నారు.. నువ్వు పని చేసుకోలేవని ఈ సదుపాయం కుాడా కోడలే చేసింది.
పనివాళ్ళతో నైనా కాస్త జాగర్తగా మసలుకో .
అంటుా హాలు లోకి వచ్చేరు.
వర్ధనమ్మ కళ్ళల్లో కన్నీరు జల జలా కారుతోంది.
అవును .తను అనవసరంగా కొడుకు కోడలికి సంబంధించిన అన్ని విషయాలలోనుా కలుగజేసుకొనేది.
పాపం కోడలు ఏ నాడుా తనకు ఎదురు జవాబు కుాడా చెప్పలేదు. తమకు కావలసినవన్నీ సమయానికి అమర్చి పెట్టేది.
ఇప్పుడు ఆలోచిస్తే తప్పంతా తనదిగానే తోస్తున్నాది.
ఈ సారి గానీ అబ్బాయి తమను వాళ్ళ దగ్గరకు తీసుకెళ్తే తను కోడలు పిల్లని ఏమాత్రం విసిగించదు.
భగవంతుడా ఈ" చే జారిన బంధాన్ని "తిరిగి
కలుపు తండ్రీ. నీ గుడికి వచ్చి నుాటెనిమిది
పొర్లు దండాలు పెడతాను .అంటుా మనసారా దేముణ్ణి వేడుకుంది వర్ధనమ్మ.
ఇదీ ఒక ఛాదస్తమే అన్న మాట మరచి.
హామీ :
ఈ కధానిక కేవలం గోరసం కొరకు మాత్రమే
రాసినది.
No comments:
Post a Comment