Friday, August 12, 2022

స్వాతంత్ర్య పోరాటం

పోర్చగీస్  పాలన  పోరుకు దారితీసె
అరాచక పాలనను అంతం చేయు తపనె
స్వాతంత్రోద్యమాల స్వాగతాలకు పిలుపు
భారతీయుల్లోన భావోద్వేగాల మలుపు ॥ 



శ్రీశ్రీ  కళా వేదిక వారి పోటీ కొరకు ,
అంశం : స్వాతంత్ర్య  సమర యొాధులు.
శీర్షిక : ఇవే నా అంజలులు.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .


పోర్చగీస్ పాలనిడె  పోరుకు ప్రేరణ
అరాచక పాలనను అంతం చేయు తపన
 స్వాతంత్రోద్యమాలకై సాయుధపోరాట పిలుపు
భారతీయుల్లోన భావోద్వేగపు మలుపు ॥ 

అనేకోద్యమాలు, అవె సాయుధ పోరాటాలు
అహింసా పోరాటాలు అవే మన సిద్ధాంతాలు.
రాక్షసత్వం నిండు రాజకీయ హోరులు
విప్లవ పోరులలో వీరులౌ విశ్వ  సైనికులు ॥

భారత సిపాయిల్లో  భారీ తిరుగుబాటు
జాతీయొాద్యమాల జనసందోహపు పోటు
వీరగతిని పొందిన వీర పుత్రులనేకులౌ లోటు స్వాతంత్ర్య సంగ్రామం దేశ భక్తికి నిండు ధీటు ॥
 
దేశం కోసం పోరాడిన ఎందరో వీరులు 
అసువులు బాసినారెందరో  ధీరులు
కీర్తి కెక్కినా కానరాని కన్నీటి చరితలు 
ధన్యులుగా స్వాతంత్ర్య సమరయొాధులు ॥

సాగించిన సమరం  సాధించెను విజయం.
దాస్య ముక్తి నొందు దీనుల కిదె సంబరం
త్రివర్ణ పతాక స్ఫుార్తి  దేశ విముక్తికి కీర్తి ॥
జనులెగరేసిరి ఝండా అడి పాడి ఆనంద గీతి ॥

వేలౌ నినాదాల వెనుకేయని గొంతులకు
వీరోచిత పోరాటంలో వీరగతి ప్రాప్తులకు
దేశంకోసం ప్రాణాలుసైతం అర్పించిన
స్వాతంత్ర్య సమర యొాధులకు...
          ॥ఇవే నా అంజలులు॥




No comments:

Post a Comment