Saturday, August 13, 2022

స్వాతంత్ర్య సమర యొాధులు. ఆటవెలదిలో

స్వాతంత్ర్య  సమర యొాధులు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

ఆంగ్ల దొరల పోరు అదెవేద ననుపెంచ
అలసె బాని సలుగ  అవని జనులు
దాశ్య శృంఖ లాల దాసజీ వితపోరు
పెరిగి పెద్ద దాయె పెరడు దాటె ॥

ఉద్య మాల బాట నురికిచే రిరివారు
ప్రాణ త్యాగ మెంచి ప్రతిన బుాని 
ఝండ చేత బుాని జయముశాంతినికోరి
జనము వేలు జేరె జరుప పోరు ॥

బాపు నాయకత్వ బాట నడచి వారు
శాంతి తోడ పోరె  శక్తి మీర
కడకు పొందె జయము కరకు పాలన వీడె
గెలుపు పిలుపు విందు గేయ ములతొ॥

వీర సైనుకులదె వీక్షీంచ నికలేరు
అమరు లైరి వారు  అలసి పోరి
వారి త్యాగ ఫలమె వచ్చె స్వాతంత్ర్యమ్ము
వరుస వారి కిడుమ వంద నమ్ము.॥

No comments:

Post a Comment