Friday, August 12, 2022

స్వాతంత్ర్య సమరోత్సవం

అంశం : స్వాతంత్ర్యామృతోత్సవం 
శీర్షిక  :  స్వాతంత్ర్య దినోత్సవానికి స్వాగతం.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర


తెల్లదొరల పాలనలో శృంఖలాల బానిసత్వం.
శుృతి మించిన కృుారత్వం అదర, రేగె కలకలం .
శాంతి నిండు బాటలో ఉద్యమాలకు శ్రీకారం.
దేశం కోసం దేహ సమర్పణల సమాహారం  ॥

ఆగ్రహ సత్యాగ్రహాలకాకలికాప్తుల చావులు
తుపాకీల కాల్పులకు దేహాలె ఖండాలు
అస్థిత్వం కానరాని   లాకప్పు జీవితాలు
రగులుతున్న రుధిరంతో ఉనికికై పోరాటాలు ॥

 యువత గుండెలాయె తుాట్లు తెగెనెన్నో తాళిబొట్లు  
 కన్నతల్లు లెందరో కోల్పోయిన పేగు తట్లు
 అందరొక్కటై  పోరగ అందినదీ స్వాతంత్ర్యం 
 స్వార్ధమన్నదే లేకను కలిసి చేయ పోరు జయం ॥

 శాంతి నిండు ఉద్యమాల బాట తాత గాంధీజీ
 వెన్నంటీ నడిచె చాచా నెహ్రూ జీ, నేతాజీ.
 వత్సరాల శాంతి పోరు కునుకు లేని జోరు హోరు
 తెచ్చె మనకు స్వాతంత్ర్యం ఇచ్చె మనకు జీవితం ॥
 
ఆనందముప్పొంగగ అభినందనల పండగ
ఆగష్టు  పదిహేనున ఆనందం నిండుగ 
ప్రతి పౌరుని కంటిలో ఉబికిన  కన్నీటి గంగ .
త్యాగధనుల జ్ఞాపకాన ఎగరె మన తిరంగా ॥

No comments:

Post a Comment