స్నేహితుల దినోత్సవం సందర్భంగా..
అంశం : చెలిమికి చిరునామా.
శీర్షిక : స్నేహమే జీవితం .
పద్య ప్రక్రియ : ఆటవెలది.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .
కష్ట నష్ట ములకు కలతచెం దెడువాడు
ఒక్క డున్న చాలు ఉత్త మంబు.
ఇష్ట మైన చెలిమి ఇలలోన మనకున్న
కరకు వెతలు కుాడ కావు బరువు ॥
అన్న అక్క కన్న ఆలుప్రే మకుమిన్న
అదెగ స్నేహ మన్న అవని లోన
పండగైన నింట పబ్బ మైనను వెంట.
చేరు వున్న సఖుడె చెలిమి పంట ॥
కలిమి లేమి లోన కడదాక నిలచేటి
కరుణ కలుగు సఖుడె కాద ఘనుడు
బాధ పంచు కున్న బాల్య స్నేహితుడుండ
బరువు భాధ లవియె భార మౌన ॥
గొప్ప బీద యనెడు గోడుయుం డనితోడు
జెప్ప లేని హితము జేయు జోడు
మనసు కోరు చెలిమి చిరునామ యతగాడు
జాతి ఏది యైన జడవ బోడు ॥
చెక్క బెట్టు పనుల చేయుాత నిడువాడు
పిలువ పక్క నున్న ప్రియము గాద.
కల్మ షమ్ము లేని కడుమంచి చెలికాడు
కలిగి యున్న వాడె కాద ఘనుడు ॥
No comments:
Post a Comment