Monday, October 3, 2022

మావేల్పువై గాచు దుర్గమ్మ పాహిమాం

శీర్షిక :  మా వేల్పుయై గాచు దుర్గ మాయమ్మ.
ప్రక్రియ : ఇష్టపది .

రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.

ముల్లోకముల నేలు ముార్తి నీవేనమ్మ
ముగురమ్మలకు నీవె గాద ముాలపుటమ్మ.
 నవరాత్రు లందున కొలువైన దుర్గమ్మ 
 పదునాల్గు లోకాల పాలించు మాయమ్మ ॥
 పాహిమాం ....పాహిమాం.....

పసుపు బొమ్మను జేసి ప్రాణాలు పోసేవు
విఘ్నములు బాపేటి  వినాయకుని జేసేవు
రిద్ధి సిద్ధుల నొసగు బుజ్జి గణపతి నిచ్చి 
మా యిడుములను బాపి మమ్మాదుకున్నావు 
పాహిమాం ....పాహిమాం.....

దుష్టులను దునిమేటి దుర్గ నీవేనమ్మ
దురితములు బాపేటి దుఃఖ భంజనివమ్మ
మంగళములిచ్చేటి మాంగళ్య గౌరివ
శివుని పట్టపు రాణి సింహ వాహినివమ్మ..
పాహిమాం .....పాహిమాం ....

తొమిదౌ రుాపాల తోడు నీవేనమ్మ 
ఆది శక్తివి నీవు అమ్మ మాయమ్మ 
అస్త్ర- శాస్త్రాదులను అష్ట భుజముల దాల్చి
అరి నాశనముజేయ అవని వెలసేవమ్మ 
పాహిమాం .....పాహిమాం ....

అవమానమున నలిగి యగ్ని దుాకిన తల్లి 
అష్ట దశ  పీఠముల అలసి వెలసే మల్లి -- 
ఖండ రుాపిణి గావు మండాండ బ్రహ్మాండ-
పిండరుాపిణి వమ్మ పిలువ పలికేవమ్మ 
పాహిమాం .....పాహిమాం ....

ఆశ్వయుజ మాసాన  అద్భుతానందవై
అవని దర్శన మిచ్చు ఆర్త త్రాణవు సుమ్మ
నవరుాపములతోడ నవావర్ణ నాయకివై
విజయమ్ము లొసగేటి విజయ రుాపిణివమ్మ॥
 పాహిమాం .....పాహిమాం ....
 

No comments:

Post a Comment