శీర్షిక : ఇదే నా దేశ ప్రగతి.
ప్రక్రియ: ఆటవెలది.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.మహారాష్ట్ర .
విశ్వ మంత జుాడ విందాయె కనులకుా
జ్ఞాన హీను లెల్ల జగతి నిండె
మేధ తోడ వారు మేడ మిద్దెలు గట్టె
చంద మామ జేరి చిందు లేసె ॥
తెలివి మీరి వారు తెగ నరికె జెట్లను
కలుషి తమ్ము జేసె గంగ నీరు
పెరుగ జనులు పెరిగె పెంట కుప్పలు చాల
పర్యవరణ మెంతొ ప్రబలె జగతి ॥
పీల్చ గాలి లేదు పిట్ట కుాతలు లేవు
చెట్టు జాడ లేక చెదరె భూామి
కంపెనీలు పెరిగి కల్మషాలవి నిండె
కణము లెన్నొ పుట్టి కాటు వేసె ॥
కామ మెంతొ పెరిగె కాలమెంతయొ మారె
పెరిగె స్వార్ధ పరులు పెక్కు గతుల
భరత భవిత నలిగె భాగ్యహీ నతగల్గె
బ్రతుకు లెన్నొ భువికి భార మాయె ॥
తినగ తిండిలేదు తిరుగాడ పనిలేదు
బ్రతుక, చెడెను మనిషి బాధ మరువ
రోగ హీను లెల్ల రోజు రోజుకు హెచ్చె
విలువ లెన్నొ తరిగె విశ్వమందు ॥
వావి వరుస మరచి వక్రమా ర్గములెంచి
విలువ, నీతి మాట విస్మ రించి
జనులు మృగము రీతి జగతిలో చరియించ
భరత మాత కలలె భగ్న మాయె ॥
No comments:
Post a Comment