Friday, October 14, 2022

బాల సాహిత్యం ....అబ్దుల్ కలామ్ .

15/10/2022
బాల సాహిత్యం 
అంశం : అబ్దుల్ కలాం 
శీర్షిక : పిల్లల్లారా రారండోయ్ ...
(గేయ కవిత)
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర 

ఆటలు ఆడీ పాటలు పాడీ 
అల్లరి చేసే పిల్లలుా..
అబ్దుల్ కలాము కధ చెపుతాను
 వినరారండే తల్లులుా ॥
 
భరత భుామిని తమిళనాడులో
ధనుష్కోటి శ్రీరామేశ్వరమున...
జన్మించెను శ్రీ అబ్దుల్ కలాము .
ఇస్లామ్ ఆతని మతము మాన్యము॥  ॥

ప్రొఫెసరుగా పని చేశాడుా..
రచనలు ఎన్నో రాసాడుా.
ఏరోస్పేసుకు ఇంజనీరుగా 
క్షిపణులెన్నొ కనుగొన్నాడు ॥

భారతదేశపు ఉన్నత పౌరుగ
పురస్కారముల నందాడు ॥
భారతరత్నగ ,బిరుదు అవార్డుల 
కీర్తి ప్రతిష్టలు పొందేడు ॥

 మంచి నడతలే  మన వ్యక్తిత్వము  
జ్ఞానమె,సంపదలన్నాడు.
నీతి -నిజాయతి ప్రతిఫలించుటే
మనిషి కందమిడు సిరులన్నాడు ॥

అపజయాలిడిన అనుభవాలె మన
బాటకు విజయపు పథమన్నాడు.
భువిని జన్మ ,నీ ఉనికి నడతలవి
చరితలకెక్కుటె ఘనమన్నాడు॥

 కలలు నిద్రలో గనుట మానుము
 కల సాకారము చేయుటె ధ్యేయము
 తలరాతలు మార్చును సంకల్పము
 గెలుపు బాటలో నడువన్నాడు॥
 
 నీతులు ఎన్నోచెప్పేడుా
 నిజమౌ గురువుగ నిలిచేడుా
 పిల్లల భవితకు స్ఫుార్తిగ నిలచి
 చివరిస్వాశనే వదిలాడుా ॥

అందరి మదిలో నిలిచాడు
ఆతని జయంతి ఈనాడు.
నిరాడంబరుడు నిత్య సంతోషుడు
కలాము చాచా అందరివాడు ॥

*********************** 
 
 






No comments:

Post a Comment