Tuesday, October 11, 2022

మత్తకోకిల పద్యాలు ...(వర్షం ).

అంశం : వర్షం.
ప్రక్రియ : మత్తకోకిల .పద్యం.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .



ఆక సమ్మున మేఘ  మొచ్చిన ఆశ పొందును వాడెగా
సేక రించును విత్త నమ్ముల సేద్య మాతడు సేయగా 
ఆక లైనను దాహ మైనను ఆగ డాతడె రైతుగా..
రుాక లప్పులు జేసి పంటకు రుాప మిచ్చును నిండుగా॥

అన్న దాతలకార్తి దీర్చును  ఆకసమ్మున మేఘుడే
చిన్ని వర్షపు జల్లు చుాడగ చిందు లేయును వారులే 
అన్న దేశపు వెన్ననంటిమి ఆతడుా మన దేముడే
మన్ను లోపల పండు బంగరు మాన్య మందరి విందులే ॥
మట్టి తల్లిని నమ్ము నాతడు మంచి పంటల నేలగా
గట్టి యత్నము జేసి పంటను గాచు కష్టము తోడుగా
పెట్టు దుడ్డుకు రాదు లాభము  వెట్టి చాకిరి దండగా
వట్టి చుక్కల వర్ష మేలగ వచ్చు దుఃఖము మెండుగా ॥

వాగు నిండెడు నీటి కోసము  వర్ష మాతనె కోరుగా
బాగు కోరును అందరీ సుఖ  భాగ్య దాతయె రైతుగా
పోగు ధాన్యపు రాసి పొందగ పోరు సల్పును వాడెగా
సాగు దుక్కికి  సారమిచ్చెడు సార వర్షమె  తోడుగా॥

*****************************::::

No comments:

Post a Comment