Friday, October 14, 2022

అబ్దుల్ కలాం ...బాల సాహిత్యం.

15/10/2022
మహతీ సాహితీ కవితా సంగమం
బాల సాహిత్యం 
అంశం : అబ్దుల్ కలాం 
శీర్షిక : పిల్లల్లారా రారండోయ్ ...
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర 



ఆటలు ఆడీ పాటలు పాడీ 
అల్లరి చేసే పిల్లలుా..
అబ్దుల్ కలాం కధ చెపుతాను
 వినరారండే తల్లులుా ॥
 
భరత భుామిని తమిళనాడులో
ధనుష్కోటి శ్రీరామేశ్వరమున...
జన్మించెను శ్రీ అబ్దుల్ కలాము .
ఇస్లామ్ ఆతని మతము మాన్యము॥  ॥

ప్రొఫెసరుగా పని చేశాడుా..
రచనలు ఎన్నో రాసాడుా.
ఏరోస్పేసుకు ఇంజనీరుగా 
క్షిపణులనే కనుగొన్నాడు ॥

భారతదేశపు అత్యున్నత పౌర 
పురస్కారమునుపొందాడు ॥
భారతరత్నగ ,అవార్డు జేతగ 
కీర్తి ప్రతిష్టలు పొందేడు ॥

వ్యక్తిత్వము సరి మంచి నడతలే
జ్ఞానపు  సంపదలన్నాడు.
అపజయాల ఆ అనుభవాలె మన
బాటకు విజయపు పథమన్నాడు.॥

జన్మించుటనీ గొప్పకాదు సరి-
మరణము  చరితను నిలుపన్నాడు.
నిజాయతీ ప్రతిఫలించు మొామే
మనిషి కందమిడు సిరులన్నాడు ॥

 కలలు నిద్రలో గనుట మానుము
 కల సాకారము నీ కర్తవ్యము
 తలరాతలు మార్చదినీ  ధ్యేయము .
 గెలుపు బాటలో నడువన్నాడు॥
 
 నీతులు ఎన్నోచెప్పేడతడు
 నిజమౌ గురువుగ నిలిచేడతడు
 పిల్లల భవితకు స్ఫుార్తిగ నిలచి
 చివరిస్వాశనే వదిలేడతడు ॥
 
 



No comments:

Post a Comment