Sunday, October 9, 2022

పోష్ట్ బాక్స్ .


🔊🔊🔊🔊🔊🔊🔊🔊🔊🔊🔊🔊

కవిశేఖరులకు నమస్కారాలు

ఈరోజు నుండి *ఉత్తమ రచనలకు (10)* మాత్రమే "ప్రశంసాపత్రాలు" అందించబడుతాయి.
సహకరించగలరు.

*పర్యవేక్షక,నిర్వాహక &సమీక్షక బృందము*
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


10/10/2022.
 .
అంశం : పోష్ట్ బాక్స్ .

శీర్షిక : అలనాటి జ్ఞాపకాలు .

రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర .

చిన్న నాటి గుర్తులు తీపి జ్ఞాపకాలు .
ఎన్నెన్నో గలవు యెంచి చుాడ వేలు.
అందలో నొకటిగా పొిష్ట్ బాక్స్ చాలు
జ్ఞప్తి కొచ్చె మంచి మధురమైన స్మృుతులు ॥ 

పొిష్ట్ మేన్ కొరకు రోజు ఎదురు చుాపులు
తాత బామ్మల మాట కాగితాల ఊసులుా
అరచేతి కొలతో అవె కార్డ్ కొలతలుా
అందులోన కానవచ్చు ముత్యాల సరాలు॥

ఉభయకుశలోపరితో మెదలు వాక్యపు విందు
కష్టసుఖముల గోడు  కళ్ళకు గట్టిన తీరు
కారేటి కన్నీరు కలచు హృదయము చుాడు
బంధాను బంధాల ప్రేమ లపుడే మేలు .॥

ప్రతి వారపు పలకరింపు ప్రతి మాటకు పులకరింపు .
ప్రతి పదముా చిలకరించుననురాగపు  ఆదరింపు ॥

రాసేటి ఉత్తరము రంగులీను పెట్టెలో
పరుగు లెట్టి వేయుటకు పది పైసలు జేబులో
అందమైన ఎర్ర పెట్టె కందినట్టి కంతలో
కార్డు కవరు జారిపోవు కనిపించని రీతిలో ॥

ఎటుల చేరునో ఏమొా వలయు చోటు పత్రము
తాళమేయు పెట్టె నుండి కదలుటే విచిత్రము.
చిన్న వయసు పోరాటము తెలుసుకొనుటకారాటము
"పోష్ట్ మేన్ "వచ్చు వరకు వేచి యుండు వారలము ॥

ఎర్ర పెట్టె కున్న తలుపు  కున్నదిలే తాళము
అది తెరచిన జాలువారు కార్డ్ కవరు లనేకము.
అన్ని పట్టి కట్టగట్టి జోలె నిండ జక్క బెట్టి 
పోష్ట్ తాత పొివు చుండ చుాచు దినములనేకము ॥

ఇంతమంది రాయు కథలు ,కవితలు కావ్యాలన్నీ
చిన్ని తుప్పు సైకిలెక్కి చేరవేయు నెటులనో...
ఉత్తరాలు ఇచ్చినాక వీధి  ఊసులాడు నతడు 
నాన్న యుచ్చు రుాపాయే నవ నిధులుగ 
దలచి మురియు॥

ఇంటింటి సిపాయిగా సమాచార మిడు ఆప్తుడు
పొిష్ట్ బాక్స్ అతని గుండె ఉత్తరాలె ఊపిరందు
బ్రతుకు తెరువు బంటతడు ఇల్లిల్లుా తిరుగుచుండు
 ఉత్తరాలు ఇచ్చి పంచు సంతసాల విశేషాలు ॥

నాటి జ్ఞాపకాలు నేడు చరవాణి  పాలాయె
వేచి యుండుటలో ప్రేమను జనులందరు కోల్పోయె.
ఆనాటి సంతసాలు  రాత ప్రతులు లేవాయె
నేటి మనిషి జీవితమే యాంత్రికమౌ బ్రతుకాయె॥

*****************************************

[10/10 23:40] మహతి. అడిగిప్పుల సదయ్య. ఇష్టపదులు: 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*మహతీసాహితీ కవిసంగమము , కరీంనగరము*
*ప్రతిరోజూ కవితా పండుగే* 

 *10/10/2022" (సోమవారం)*

*ఉత్తమ చిత్రకవితలు:*
🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚

*శ్రీమతి/శ్రీ*
1.పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు  
2.మేడిశెట్టి యోగేశ్వరరావు గారు 
3.దొంతరాజు విజయలక్ష్మి గారు 
4 వి విజయశ్రీ దుర్గ గారు 
5.మరుదాడు అహల్యాదేవి గారు
6.మాకన వెంకట ఉమాదేవి గారు 
7.వి.టి.ఆర్. మోహనరావు గారు 
8.పోగుల భాగ్యలక్ష్మి గారు
9.యం జితేంద్ర గారు
10.గంపా శ్రీదేవి గారు.

*పర్యవేక్షణ :డా. అడిగొప్పుల సదయ్య గారు* 
నిర్వహణ: *శ్రీ దాసరి చంద్రమౌళి గారు*
సమీక్షణ: *శ్రీ తెలికిచర్ల రాజకృష్ణ కామేశ్వరరావు గారు*
[10/10 23:48] +91 94418 71767: *నేను గత ఒకటిన్నర సంవత్సరాలుగా సమీక్షలు చేస్తున్నాను,  కానీ ఈ రోజు వచ్చినన్ని  (102 కవితలు)* *కవితలు ఏ రోజు రాలేదు. ఓపికగా, ఆనందంగా కాలాతీతమైనా కూడా పూర్తి చేయ కలిగాను. ఈ రోజు* *చాలా ఆనందంగా ఉంది. నా సమీక్షలలో లోపాలున్నా మంచి మనసుతో మన్నించండి. నాకు* 
*ఈ అవకాశం ఇచ్చిన శ్రీ సదయ్య గారికి, ఈ రోజు నిర్వాహకులు చంద్ర మౌళి గారికి కృతజ్ఞతలు.* *సమూహంలోని ఇతర నిర్వాహకులకు, సమీక్షకులకు కూడా  కృతజ్ఞతలు.*

 *అందరికీ శుభరాత్రి.*
*కామేశ్వర రావు*



 

 

No comments:

Post a Comment